టిఎస్ బిపాస్ అమలులో జాప్యం?

  మంత్రిమండలి అనుమతి లభించిన తరువాతనే అమలు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్‌ఎంసి పరిధిలో అమలు కావాల్సిన టిఎస్ బిపాస్ విధానంలో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బిపాస్‌కు సంబంధించిన సాప్ట్‌వేర్ టెస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించిన తరువాతనే, అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖ తుది […] The post టిఎస్ బిపాస్ అమలులో జాప్యం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంత్రిమండలి అనుమతి లభించిన తరువాతనే అమలు
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్‌ఎంసి పరిధిలో అమలు కావాల్సిన టిఎస్ బిపాస్ విధానంలో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం బిపాస్‌కు సంబంధించిన సాప్ట్‌వేర్ టెస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించిన తరువాతనే, అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిపాస్ అమలు మరికొన్ని రోజుల పట్టే అవకాశముందని ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ స్పందిస్తూ, బిపాస్ విధానానికి మంత్రివర్గ మండలి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ నుంచి అనుమతి పొందిన తర్వాతనే ‘టిఎస్ బిపాస్’ అమలు చేస్తామని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు.

ప్రస్తుతం బిపాస్ అమలుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ట్రయల్ టెస్టింగ్ జరుగుతోందన్నారు. తెలంగాణ మునిసిపాలిటీ యాక్2019ను అనుసరించి ఈ విధానాన్ని రూపొందించామన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు, పట్టణ ప్రణాళికకు సంబంధించిన నిబంధనలను అమలు చేయడానికి టిఎస్ బిపాస్ (తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి అనుమతి ఆమోదం) అభివృద్ధి చేసిందని ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అర్వింద్‌కుమార్ తెలిపారు.

ప్రధానంగా వివిధ శాఖ మధ్య కావాల్సిన అనుసంధాన ప్రక్రియ, ప్రభుత్వ స్థలాలు, జలశాయాలు మొదలైన నిషేధిత సర్వే నంబర్ల వివరాలకు సంబంధించిన సమాచార సంక్షిప్తీకరణ కార్యక్రమం పురోగతిలో ఉందని ఆయన తెలిపారు. కేబినెట్‌లో అన్ని విషయాలను కూలకషంగా చర్చించిన తరువాత మాత్రమే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన మొత్తం ప్రక్రియను సులభ, సరళీకృత, సమయబద్ద, పారదర్శక పద్దతిలో ప్రజలకు అందించడానికి తుది నిర్ణయమని ఆయన వెల్లడించారు.

TS-bPASS implemented only after Cabinet approval

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టిఎస్ బిపాస్ అమలులో జాప్యం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: