రాష్ట్రంలో మరి 74 కేసులు

  ఆరుగురు మృతి, పచ్చడితో ఊరంతా పరేషాన్ రాష్ట్రానికి చెందిన 60 మంది, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన 14 మందికి వైరస్ 2499కి చేరిన కరోనా పాజిటివ్ సంఖ్య జీరో కేసుల జాబితా నుంచి వనపర్తి తొలగింపు జియాగూడ, కార్వాన్ ప్రాంతాల్లో అత్యధిక తీవ్రత మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. శనివారం కేవలం 74 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో […] The post రాష్ట్రంలో మరి 74 కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆరుగురు మృతి, పచ్చడితో ఊరంతా పరేషాన్
రాష్ట్రానికి చెందిన 60 మంది, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన 14 మందికి వైరస్
2499కి చేరిన కరోనా పాజిటివ్ సంఖ్య
జీరో కేసుల జాబితా నుంచి వనపర్తి తొలగింపు
జియాగూడ, కార్వాన్ ప్రాంతాల్లో అత్యధిక తీవ్రత

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. శనివారం కేవలం 74 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 41 మంది ఉండగా, రంగారెడ్డిలో 5, సంగారెడ్డి 3,మహబూబ్‌నగర్‌లో 2, జగిత్యాల 2, సూర్యపేట్, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోక్క కేసులు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు 9 మంది వలస కార్మికులకు, ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గాల ద్వారా వచ్చిన ఐదు మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య2499కి చేరగా, వీటిలో రాష్ట్రానికి చెందిన కేసులు 2068 ఉన్నాయి. అదే విధంగా వలస కార్మికులు, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్లు, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు మొత్తం 431 మందికి వైరస్ తేలింది.

ఇప్పటి వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకోని ఆరోగ్యవంతులుగా 1412 మంది ఇళ్లకు చేరగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 1010 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ దాడిలో మొత్తం 77 మంది చనిపోయారని వైద్యారోగ్యశాఖ ధ్రువీకరించింది. వికారాబాద్ జిల్లా తాండూరులో వైరస్ కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఇక్కడికి వచ్చిన తర్వాత వైరస్ తేలిందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ కూతురికి వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. అయితే గ్రేటర్ పరిధిలో కేసులు భారీగా నమోదవుతుండటంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీ జియాగూడ, కార్వన్ తో పాటు మరో 15 ప్రాంతాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉందని వైద్యశాఖ చెబుతుంది.

24 రోజుల పసికందు, 3 నెలల బాబు మృతి
వైరస్ దాడిలో మరో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. దీనిలో 24 రోజుల పసికందు, 3 నెలల బాబు ఉండటం ఆందోళనకరం. వీరిలో 3 నెలల బాలుడికి గుండె సమస్యలు ఉన్నాయని, అదే విధంగా 24 రోజుల పసికందు వైరస్ దాడిని తట్టుకోలేక మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా హైపర్‌టెన్షన్ , డయాబెటిస్ కలిగిన 58, 62 ,52 ఏళ్ల వయస్సు కలిగిన ముగ్గురు వ్యక్తులు కరోనా సోకి మృతి చెందారు. దీంతో పాటు హార్ట్ సర్జరీ చేపించుకున్న 47 ఏళ్ల వ్యక్తి కూడా కోవిడ్ సోకి మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కొత్తగా వనపర్తి జిల్లాలో కేసు నమోదు కావడంతో జీరో కేసుల జాబిత నుంచి ఈ జిల్లాను అధికారులు తొలగించారు.

74 COVID-19 cases, 6 deaths in Telangana

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రంలో మరి 74 కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: