4న కృష్ణ బోర్డు భేటీ

  తెలంగాణ, ఆంధ్ర ఫిర్యాదులపై చర్చ రెండు రాష్ట్రాలకు సమాచారం పంపించిన బోర్డు మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధ వేదికగా 4 జూన్ ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆంధ్ర, తె లంగాణ ప్రభుత్వాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం సమాచారం అం […] The post 4న కృష్ణ బోర్డు భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలంగాణ, ఆంధ్ర ఫిర్యాదులపై చర్చ
రెండు రాష్ట్రాలకు సమాచారం పంపించిన బోర్డు

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్ జలసౌధ వేదికగా 4 జూన్ ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆంధ్ర, తె లంగాణ ప్రభుత్వాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం సమాచారం అం దిం చారు. ఆంధ్ర, తెలంగాణ సాగునీటి పారుదల శాఖలు కృష్ణానదీ జలాల వినియోగంపై పరస్పర ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు రోజుకు 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఒ 203 విడుదల చేయడంతో పాటు పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వడాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ తీవ్రంగా ఆక్షేపించింది.

ఇప్పటికే 44 వేల క్యూసెక్కులను తరలిస్తున్న ఆంధ్ర మరో 80 వేలక్యూసెక్కులు తరలిస్తే కృష్ణానదీపై ఆధారపడి నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ జిఒను గ్రీన్‌ట్రిబ్యునల్ తప్పు బట్టినప్పటికీ ఇప్పటివరకు ఆంధ్రప్రభుత్వం స్పందించక పోవడంపై తెలంగాణ నీటి పారుదల శాఖ ఆగ్రహంగా ఉంది. జిఒను ఉపసంహరించక పోతే న్యాయపోరాటం చేస్తామని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ కృష్ణానదీ యాజమాన్యబోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ప్రస్తుత నీటి సంవత్సరంలో కేటాయింపులను ఉల్లంఘించి కృష్ణానదీ జలాలను ఆంధ్ర అధికంగా వినియోగించిందని కృష్ణానదీ యాజమన్యం బోర్డు వెల్లడించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది.

కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బిసి సామర్థం తెలంగాణ ప్రభుత్వం పెంచిందని ఆంధ్ర ఆరోపణలు చేసింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిపిఆర్‌లను సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు మేరకు కృష్ణాబోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇరు రాష్ట్రాలు చేసుకున్న ఫిర్యాదులే కాకుండా చర్చించాల్సిన ఇతర అంశాలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాలను కోరింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఉన్న ప్రాజెక్టులు, తర్వాత చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లు, రెండు రాష్ట్రాల ఫిర్యాదులపై సుధీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

అలాగే టెలిమెట్రీల ఏర్పాటు, నీటిమట్టాల నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తేదీ ఖరారు చేసే అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే అపెక్స్ కౌన్సిల్ జరగాలంటే రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించాల్సి ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం జరిగే ప్రత్యేక సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యకార్యదర్శిలు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, బోర్డు ఛైర్మన్, నీటిపారుదల శాఖ నిపుణులు పాల్గొననున్నారు.

Krishna River Board to Hold Meeting on June 4

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 4న కృష్ణ బోర్డు భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: