కేసులు పెరుగుతాయ్

  పిల్లలు, పెద్దలు బయటకు రావొద్దు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చికిత్సా సదుపాయాలు సమకూర్చింది ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక వ్యాప్తి లేదు ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తక్కువ రాష్ట్రంలో మరణాల శాతం తగ్గింది మీడియాతో డిహెచ్ డిఎం వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అ్రపమత్తంగా ఉండాలని ప్రజారోగ్య, కుటుం […] The post కేసులు పెరుగుతాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పిల్లలు, పెద్దలు బయటకు రావొద్దు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని చికిత్సా సదుపాయాలు సమకూర్చింది
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
సామాజిక వ్యాప్తి లేదు
ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తక్కువ
రాష్ట్రంలో మరణాల శాతం తగ్గింది
మీడియాతో డిహెచ్ డిఎం వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అ్రపమత్తంగా ఉండాలని ప్రజారోగ్య, కుటుం బ సంచాలకులు డా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ప్రభుత్వం కరోనా తీవ్రతను తగ్గించేందుకు, ట్రీట్మెంట్ కోసం అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచిదని, కానీ ప్రజలు తమ వంతు బాధ్యతగా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పది సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు బయటకు రాకపోవడం మంచిదని ఆయన సూచించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నప్పటికీ, ఎక్కడా సామాజిక వ్యాప్తి జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, వైద్యాశాఖ కరో నా చికిత్స విధానంలో ఐసిఎంఆర్(ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కరోనా అంశంలో తాము వెల్లడించే వివరాలన్నీ వాస్తవాలేనని, ఎక్కడా గోప్యత లేదని ఆయన తెలిపారు. వైద్యశాఖ గత మూడు నెలలుగా నిరంతరం శ్రమిస్తుందని ఆయన చెప్పా రు. అవగాహన లేని కొందరు ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. ఇనాళ్లు లాక్‌డౌన్‌కు సహకరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ అంశంపై ఆయన కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ రమేష్‌రెడ్డితో కలసి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… గత మూడు నెలలు గా కోవిడ్ 19 అరికట్టడానికి అన్ని డిపార్ట్‌మెంట్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు.

గత మూడు నెలలుగా ప్రజలు లాక్‌డౌన్‌కు అద్బుతంగా సహకరించారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో తెలంగాణకి చెందినవి 2008 ఉండగా, ఫారిన్ కేసులు 30 వరకు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మర్కజ్ లింకుల నుంచే ఎక్కువ కేసులు వచ్చాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లాక్ డౌన్ సడలింపుల తరువాత వలస కార్మికులు,ఇతర రాష్ట్రాలకు చెందినవారు రావడం వల్ల ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయన్నారు. దీంతో పాటు ప్రస్తుతం వేరే దేశం వాళ్ళు రావడం వల్ల మరిన్ని కేసులు పెరిగాయని తెలిపారు. తెలంగాణ లో కోటి కుటుంబాలు ఉంటే తొలి విడత కేవలం 546 కుటుంబాలు మాత్రమే వైరస్ వల్ల ఇబ్బంది పడ్డాయని, కానీ 4వ లాక్ డౌన్ లో 1005 కేసులు నమోదుతో వైరస్ తీవ్రత మరో 470 కుటుంబాలపై పడిందన్నారు.

లాక్ డౌన్ సమయంలో ఎక్కడికి వెళ్లోద్దని, ఎక్కువ మంది గూడికూడవద్దు అని సూచించినా, కొంద మంది నిర్లక్షంగా వ్యవహరించడంతో కేసులు భారీగా పెరిగాయన్నారు. వీటిలో కొన్ని పరిశీలిస్తే, బోరాబండ లో ఓ యువకుడు ద్వారా 14మందికి వచ్చిదని తెలిపారు. అదే విధంగా వనస్థలిపురంలో ఒక బర్త్ డే పార్టీ ద్వారా 82 మందికి వైరస్ సోకిందని పేర్కొన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాల్లో ఓ ఓడి బియ్యం ఫంక్షన్ ద్వారా మరో ఫ్యామిలీకి కరోనా అంటుకుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించి ఉంటే కేసులు తీవ్రత ఇంకా తక్కువగానే ఉండేవని తెలియజేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ లేనందు వలన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం వలన, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి మూడు సూత్రాలతో వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు.

గత పది రోజుల్లో గమనిస్తే లాక్ డౌన్ నిర్లక్ష్యం చేసిన ప్రదేశాల్లో మాత్రమే కేసులు పెరిగాయని అన్నారు. రాబోయే రోజుల్లో కరోన తో ఖచ్చితంగా సహజీవనం చేయాల్సి ఉందని చెప్పారు. అయితే సర్వ్ లైన్స్ సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై దృష్టి పెడుతున్నామని, వాటి నివారణ కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారం వారం మందులు, చికిత్స వివరాలను స్వయంగా పరిశీలిస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టారని, దీని వల్ల రాష్ట్రంలో గతం కంటే 30 శాతం మరణాల తగ్గాయని ఆయన వెల్లడించారు.

లక్షా 5ం వేల మందిలో వెయ్యి మందికి టెస్టులు
ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు లక్షా యాబై వేల మంది వలస కార్మికులు వస్తే వారిలో లక్షణాలు ఉన్న వెయ్యి మందికి టెస్టులు చేయగా, 175 మందికి వైరస్ సోకిందని డిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం జిల్లాల్లో 82,313 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా, మిగతా వారు జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్నారని అన్నారు. వీరిలో ఎక్కువ మంది యాదాద్రి జిల్లాకు చెందిన వారేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ముంబై నుంచి వస్తున్న వలస కార్మికుల్లో సుమారు 50 శాతం మందికి పైగా వైరస్ నిర్ధారణ అవుతుందని ఆయన తెలిపారు.
4700 మంది రోగులకు 8 వారాల పాటు….
రాష్ట్రంలో కరోనాతో మరణించే వారిలో ఎక్కువ మంది సారి, ఇతర రోగాలతో బాధపడుతున్న వారే చనిపోతుండటం వలన వారిపై దృష్టిసారించామని డిహెచ్ పేర్కొన్నారు. ప్రతి వారం 4700 మందికి 8 వారాల పాటు టెస్టులు చేయగా కేవలం 3 శాతం మందిలో మాత్రమే పాజిటివ్ రేట్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 3ం వేల మందికి టెస్టులు చేయగా, 2425 మందికి వైరస్ సోకిందని తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా…
కరోనా నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతుందని డిహెచ్ డా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇన్‌ప్లూయింజా, జ్వరం బాధితులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించామని పేర్కొన్నారు. అదే విధంగా ఎవరైన చనిపోతే, వెంటనే సమాచారం ఇవ్వాలని, దానికి కారణాలు కూడా వెల్లడించాలని చెప్పినట్లు ఆయన అన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ డా రమేష్‌రెడ్డి మాట్లాడుడూ…లాక్ డౌన్ సరిగా అమలు చేయని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనాని చాలా వరకు అరికట్టగలిగామన్నారు. ప్రస్తుతం కొత్త ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతుండటంతో వాటిపై కూడా మరింత దృష్టి పెట్టాం.

లాక్ డౌన్ సడలింపు తర్వాత కేవలం 5 శాతం పేషంట్స్ కు మాత్రమే వైరస్‌తో ఇబ్బంది తలెత్తుతుందన్నారు. వాళ్ల నుంచే కేవలం మరణాలు సంభవిస్తున్నాయన్నారు. 70 ఏళ్ల పైన ఉన్న వారు ,ఇతర వ్యాధులు ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలను సమకూర్చామని పేర్కొన్నారు. సీరియస్ కండిషన్ రోగుల కోసం గాంధీ హాస్పిటల్ 1500 ఆక్సిజన్ లైన్స్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. చెస్ట్ హాస్పిటల్ ,కింగ్ కోటి హాస్పిటల్స్‌తో పాటు జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా మరిన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సిద్ధంగా చేస్తున్నాం… కరోనా కేసులకు వెంటిలేటర్లు అవసరం తక్కువగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు.

కరోన వచ్చిన 7 రోజుల తరువాత అతని నుంచి నుండి ఇంకొకరికి విస్తరించే అవకాశం లేదని, 9 వ రోజు వైరస్ కణాలు పూర్తిగా నశిస్తాయని పేర్కొన్నారు. అయితే సదరు వ్యక్తి ఆర్‌ఎన్‌ఏ మాత్రం వైరస్ ఉంటుందని, శ్వాసవ్యవస్థ, తుంపర్లతో ఉండదని ఆయన తెలిపారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తి జరగదని వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం హోమ్ ఐసోలేషన్ లో ఉంచి కూడా కొందరికి చికిత్స చేస్తూ పరిశీలిస్తున్నామన్నారు. కరో నా రోగిని ప్రత్యేక గదిలో ఉంచి, నిత్యం డాక్టర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కరోన వచ్చి తగ్గిన తర్వాత భవిష్యత్‌లో దాని ప్రభావం లంగ్స్ మీద ఉంటుందని ఆయన వెల్లడించారు.

death toll in the state has decreased says DHDM

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేసులు పెరుగుతాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: