అమెరికాలో ఆందోళనలు హింసాత్మకం

  పలు చోట్ల పోలీసులపై రాళ్ల దాడి, వాహనాలు, రెస్టారెంట్ల ధ్వంసం కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయుల మృతి అట్లాంటా : అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు హింసాత్మక రూపం దాలాయి. ఓ పోలీస్ అధికారి అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్(46) ఉదంతానికి నిరసనగా శుక్రవారం పలు నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఫీనిక్స్,డెన్వర్, లాస్ వెగాస్,డెట్రాయిట్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ నగరాల్లో జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్ అంటూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. మిన్నెసోట […] The post అమెరికాలో ఆందోళనలు హింసాత్మకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పలు చోట్ల పోలీసులపై రాళ్ల దాడి, వాహనాలు, రెస్టారెంట్ల ధ్వంసం
కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయుల మృతి

అట్లాంటా : అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు హింసాత్మక రూపం దాలాయి. ఓ పోలీస్ అధికారి అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్(46) ఉదంతానికి నిరసనగా శుక్రవారం పలు నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి.

ఫీనిక్స్,డెన్వర్, లాస్ వెగాస్,డెట్రాయిట్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ నగరాల్లో జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్ అంటూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. మిన్నెసోట రాష్ట్రంలోని మిన్నియపొలిస్‌లో ఈ నెల 25న ఫ్లాయిడ్ మెడపై ఓ తెల్ల పోలీస్ మోకాలితో అదిమి పట్టి చంపిన విషయం తెలిసిందే. ఆ సంఘటనకు నిరసనగా అమెరికాలోని నల్లజాతీయులు పలు నగరాల్లో ఆందోళన చేపట్టారు. పలు చోట్ల పోలీసులపైకి రాళ్లు విసిరి ఘర్షణకు దిగారు. ఈ సంఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నల్ల జాతీయులు మృతి చెందారు. అట్లాంటాలో మొదట శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు అడ్డుపడ్డ పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీస్ వాహనాలపై రాళ్లు విసిరారు.

ఓ వాహనాన్ని తగులబెట్టారు. పోలీస్ అధికారులపై బాటిళ్లు విసిరి ఉద్యోగాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలు, రెస్టారెంట్లపైనా రాళ్లు విసిరారు. ఆందోళనకారులు పలు ప్రైవేట్ కార్లనూ తగులబెట్టారు. ఓ హోటల్ ధ్వంసమైంది. తమపైకి ఇటుకలు, బాటిళ్లు, కత్తులు విసిరారని అట్లాంటా పోలీస్ అధికారి కార్లోస్ క్యాంపోస్ తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు అధికారులు గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపైకి భాష్ప వాయువు ప్రయోగించి పలువురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. మిన్నియపొలిస్ నగరంలో కర్ఫూను కూడా లెక్క చేయకండా వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి పోలీసులతో ఘర్షణ పడ్డారు.

ఆందోళనకారుల దాడిలో పలు రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు ధ్వంసమయ్యాయి. ఓ పోలీస్ స్టేషన్ తగులబడింది. కొన్నిచోట్ల కాల్పుల సంఘటనలూ జరిగాయి. అయితే, పోలీసులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులో పెట్టడానికి అవసరమైతే మిలిటరీని రంగంలోకి దించనున్నట్టు పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. ఫ్లోరిడాలో నల్లజాతి ట్రాన్స్‌జెండర్‌ను పోలీసులు కాల్చి చంపారు. టోనీ మెక్‌డాడే(౩8) అనే ట్రాన్స్‌జెండర్ తన పొరుగున ఉన్న తెల్లజాతికి చెందిన ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచినట్టు పోలీసులు తెలిపారు. మెక్‌డాడేను పట్టుకునే క్రమంలో ఆమె తమపైకీ కాల్పులు జరిపిందని, ఎదురు కాల్పుల్లో మృతి చెందిందని వారు తెలిపారు. డెట్రాయిట్‌లోనూ ఓ ఆందోళనకారుడు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు.

Protests spread across US over George Floyd death

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమెరికాలో ఆందోళనలు హింసాత్మకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: