పైలెట్‌కు కరోనా.. ఢిల్లీకి విమానం తిరుగుముఖం

  న్యూఢిల్లీ: పైలెట్‌కు కరోనా ఉందని తేలడంతో కరోనా రోగి కారణంతో మార్గమధ్యంలోనే ఓ విమానాన్ని వెనక్కి రప్పించారు. శనివారం ఉదయం ఈ అరుదైన ఘటన జరిగింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా రష్యాలో చిక్కుపడ్డ భారతీయులను తీసుకువచ్చేందుకు విటి ఎఎక్స్‌ఆర్ ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఉజ్బెకిస్థాన్‌కు సమీపంలో ఉండగా విమానాన్ని వెనక్కి రప్పించారు. విమాన పైలెట్లలో ఒక్కరికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయిందని, తమ పరీక్షలలో ఇది […] The post పైలెట్‌కు కరోనా.. ఢిల్లీకి విమానం తిరుగుముఖం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: పైలెట్‌కు కరోనా ఉందని తేలడంతో కరోనా రోగి కారణంతో మార్గమధ్యంలోనే ఓ విమానాన్ని వెనక్కి రప్పించారు. శనివారం ఉదయం ఈ అరుదైన ఘటన జరిగింది.

వందే భారత్ మిషన్‌లో భాగంగా రష్యాలో చిక్కుపడ్డ భారతీయులను తీసుకువచ్చేందుకు విటి ఎఎక్స్‌ఆర్ ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఉజ్బెకిస్థాన్‌కు సమీపంలో ఉండగా విమానాన్ని వెనక్కి రప్పించారు. విమాన పైలెట్లలో ఒక్కరికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయిందని, తమ పరీక్షలలో ఇది స్పష్టం అయిందని వెంటనే విమానాన్ని వెనకకు తీసుకురావాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ప్రోటోకాల్‌ను పాటించాల్సి ఉందని స్పష్టం చేశారు.

విమాన ప్రయాణానికి ముందు జరిపిన పరీక్షలలో పొరపాటున ఈ పైలెట్‌కు వైరస్ లేదనే రిపోర్డు వచ్చింది. అయితే తరువాతి క్రమంలో పరిశీలించగా పాజిటివ్ అని స్పష్టం అయింది. దీనిని గుర్తించి వెంటనే విమానాన్ని తిరుగుముఖం పట్టించారు. దాదాపుగా గమ్యస్థానం చేరుకునే దశలో విమానం తిరిగి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఢిల్లీ విమానాశ్రయం చేరుకుందని అధికారులు తెలిపారు. కరోనా సంబంధిత పైలెట్‌ను, మిగిలిన సిబ్బందిని నిబంధనల మేరకు క్వారంటైన్‌కు తరలించారు.

Air India Delhi-Moscow flight called back

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పైలెట్‌కు కరోనా.. ఢిల్లీకి విమానం తిరుగుముఖం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: