ఇక పెట్రోల్ హోం డెలివరీ!

  త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి న్యూఢిల్లీ: ఇతర నిత్యావసరాల మాదిరిగానే పెట్రోల్, సిఎన్‌జిని హోం డెలివరీ చేయడానికి కేంద్రం త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఇంధనం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2018నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను హోం డెలివరీ […] The post ఇక పెట్రోల్ హోం డెలివరీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి

న్యూఢిల్లీ: ఇతర నిత్యావసరాల మాదిరిగానే పెట్రోల్, సిఎన్‌జిని హోం డెలివరీ చేయడానికి కేంద్రం త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఇంధనం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2018నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను హోం డెలివరీ చేస్తోంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీ రెపోస్ ఎనర్జీ మొబైల్ పెట్రోల్ పంపుల తయారీకి ముందుకు వచ్చింది. వాటి ద్వారా ఇంటివద్దకే పెట్రోల్ సరఫరా చేసే వీలు కలుగుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఇదిలా ఉండగా, సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి,పిఎన్‌జి వంటి అన్ని రకాల ఇంధనాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఇంధన స్టేషన్లను పునరుద్ధరిస్తామని ప్రధాన్ సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే వాటి కోసం జనాలు బారులు తీరకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కాగి లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఆయిల్ డిమాండ్ 70 శాతం తగ్గిన విషయం తెలిసిందే.

Oil companies may provide all fuels at doorstep

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇక పెట్రోల్ హోం డెలివరీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: