బీమా రంగంలో భారీగా కొత్త ఉద్యోగాలు

  ఈ త్రైమాసికంలోనే 3 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్న ఇన్సూరెన్స్ కంపెనీలు కరోనాతో తర్వాత ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత పెరుగుతుందని అంచనాలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా అనేక రంగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతూ ఉంటే బీమా రంగంలో మాత్రం ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయి. జూన్ త్రైమాసికంలో బీమా కంపెనీలు కొత్తగా అయిదు వేల మందిని ఉద్యోగాల్లో నియమించుకోబోతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత వ్యాపారం ఊపందుకోవచ్చన్న అంచనాలతో అటు లైఫ్, ఇటు జనరల్ బీమా […] The post బీమా రంగంలో భారీగా కొత్త ఉద్యోగాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ త్రైమాసికంలోనే 3 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
కరోనాతో తర్వాత ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత పెరుగుతుందని అంచనాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా అనేక రంగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతూ ఉంటే బీమా రంగంలో మాత్రం ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయి.

జూన్ త్రైమాసికంలో బీమా కంపెనీలు కొత్తగా అయిదు వేల మందిని ఉద్యోగాల్లో నియమించుకోబోతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత వ్యాపారం ఊపందుకోవచ్చన్న అంచనాలతో అటు లైఫ్, ఇటు జనరల్ బీమా కంపెనీలు నియామకాలకు సై అంటున్నాయి. ఈ త్రైమాసికంలో దాదాపు 1500 మందిని నియమించుకోవడానికి పిఎన్‌బి మెట్‌లైఫ్ సిద్ధమవుతోంది. ఏడాది చివరి నాటికి ఈ నియామకాలను 3,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. కెనరా హెచ్‌ఎస్‌బిసి, ఒబిసి లైఫ్‌లు కూడా చెరో వెయ్యి మందిని నియమించుకోవాలని అనుకొంటున్నాయి.

టాటా ఎఐజి వెయ్యి మందిని, టాటా ఎఐఎ లైఫ్ 500 మందిని కొత్తగా నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 300 నియామకాలు చేపట్టిన రిలయన్స్ నిప్పన్ లైఫ్ మరో 400 మందిని నియమించుకోవాలని అనుకుంటోంది. కరోనా సంక్షోభం అనంతరం బీమా తీసుకునే వారు పెరుగుతారన్న అంచనాలతో బీమా కంపెనీలు కొత్తగా నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయని టీమ్‌లీజ్ రిక్రూటింగ్ సంస్థ అధిపతి అజయ్ షా అభిప్రాయపడ్డారు.

దీనికి తోడు ఈ రంగంలో చోటు చేసుకున్న కొత్త కలయికలు, విలీనాలతో ఉద్యోగాలు పెరగనున్నాయని అంటున్నారు. లాక్‌డౌన్ అనంతరం తిరిగి ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు మొదైల వేతన జీవులకు జీతాలు సకాలంలో అందడం మొదలైతే వారు మొదటగా చూసేది బీమా ఉత్పత్తుల వైపేనని బీమా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలకు తమ ఆరోగ్యం, తమ వారి జీవితాలపై శ్రద్ధ పెరగడం బీమా రంగం మరింతగా దూసుకు పోవడానికి దోహదం చేస్తాయని వారు భావిస్తున్నారు.

5 insurers looking to hire about 5,000 people

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బీమా రంగంలో భారీగా కొత్త ఉద్యోగాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: