రూ.27 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

దేశ జిడిపిలో 13.5 శాతం ఆవిరి ప్రతి పది స్టాక్స్‌లో 9 నెగెటివ్ రిటర్న్‌లే మోడీ ఏడాది పాలనలో నష్టాలే మూటకట్టుకున్న దలాల్ స్ట్రీట్ న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారం (మే 30)తో ఏడాది పూర్తయింది. మిగతా రంగాల్లో మోడీ ప్రభుత్వం పని తీరు ఎలా ఉన్నప్పటికీ ఆర్థిక రంగం విషయంలో మాత్రం అధ్వాన్నంగా ఉందని విశ్లేషకుల అంచనా. దానికి దేశీయ స్టాక్ మార్కెట్ అద్ద పడుతోంది. గత ఏడాది కాలంలో […] The post రూ.27 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దేశ జిడిపిలో 13.5 శాతం ఆవిరి
ప్రతి పది స్టాక్స్‌లో 9 నెగెటివ్ రిటర్న్‌లే
మోడీ ఏడాది పాలనలో నష్టాలే మూటకట్టుకున్న దలాల్ స్ట్రీట్

న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారం (మే 30)తో ఏడాది పూర్తయింది. మిగతా రంగాల్లో మోడీ ప్రభుత్వం పని తీరు ఎలా ఉన్నప్పటికీ ఆర్థిక రంగం విషయంలో మాత్రం అధ్వాన్నంగా ఉందని విశ్లేషకుల అంచనా.

దానికి దేశీయ స్టాక్ మార్కెట్ అద్ద పడుతోంది. గత ఏడాది కాలంలో దలాల్ స్ట్రీట్ ఏకంగా రూ.27 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. హరించుకుపోయిన సొమ్ము దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో 13.5 శాతానికి సమానం. అంతేకాదు కోవిడ్19సంక్షోభంతో కుదేలయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజితో పోలిస్తే ఈ మొత్తం విలువ 35 శాతం ఎక్కువ. ఇదే ఏడాదిలో ప్రతి పది స్టాక్స్‌లో 9 స్టాక్‌లు నెగెటివ్ రిటర్న్‌లు ఇచ్చాయి.

ఇదే సమయంలో బిఎస్‌ఇలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10 శాతం కంపెనీల షేర్లు మాత్రమే రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. మరో వైపు కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి ముందే ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్న జిడిపి కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో నాలుగో త్రైమాసికంలో మరింతగా దిగజారి 3.1శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద జిడిపి వృద్ధి 11 ఏళ్ల కనిష్టస్థాయి అంటే 4.2 శాతానికి చేరుకోగా, పారిశ్రామిక ఉత్పత్తి సౌతం గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఇక ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా తగ్గిపోయిన తరుణంలో పెట్టుబడి పెట్టడానికి ఏదయినా సరయిన రంగం ఉందా అనే అనుమానాలను ఇన్వెస్టర్లు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే గత మూడు నెలల్లో పరిణామాలు ఎవరూ ఊహించనివని, నిజంగా చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థకు దాని పరిమితులు దానికున్నాయని శామ్‌కో సెక్యూరిటీస్‌లో రిసెర్చ్ విభాగం హెడ్ ఉమేశ్ షా అంటున్నారు. అయితే నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు మందగించడానికి జిఎస్‌టిఅమలు లాంటి ఇంతకు ముందు తీసుకున్న సంస్కరణల ప్రభావమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ పరిస్థితిని సరి చేసుకునే వాతావరణం భారత మార్కెట్‌లో ఉందని గత వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మార్కెట్ పతనాలు చెబుతున్నాయి.

కేవలం 10 శాతం స్టాక్స్ మాత్రమే లాభాలు అందిస్తున్నప్పుడు మిగతా 90 శాతం మార్కెట్ మాటేమిటనేది మదుపరుల ప్రశ్న. అయితే 201920 సంవత్సరం మదుపరుల పాలిట ‘ వాషౌట్ సంవత్సరం’గా నిలిచిపోయిందనే విషయాన్ని విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ధరల్లో స్టాక్స్ కొనుగోలు చేసిన పక్షంలో మరో మూడేళ్ల తర్వాత మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉందని వారు అంటున్నారు. గణాంకాలను బట్టి చూసినట్లయితే బిఎస్‌ఇలోని అన్ని స్టాక్స్ విలువ గత ఏడాది మే 30న రూ.154.44 లక్షల కోట్లు ఉంటే ఈ రోజు (శనివారం) నాటికి రూ.127.06 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలో ఈ స్టాక్స్ విలువ 17.7 శాతం పడిపోయింది.

కాగా మోడీ ఏడాది పాలనకు పది మార్కులకు గాను ఏడు మార్కులు ఇచ్చిన హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌కు చెందిన దీపక్ జైసని మాట్లాడుతూ,‘ ప్రభుత్వం పనితీరుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రామాణికం కాదు.ప్రభుత్వం పని తీరు కేవలం ప్రభుత్వ విధానంపైనే ఆధారపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటుగా ఇతర అనేక అంశాలపై మార్కెట్లను ప్రభావితం చేస్తాయి’ అని అన్నారు.

Investors lose Rs 27L cr in equity wealth

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.27 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: