ఓఎల్‌ఎక్స్‌లో అమ్మినా…కొనుగోలు చేసినా కొట్టేస్తారు

  హైదరాబాద్: అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే సామెతా ఓఎల్‌ఎక్స్‌కు సరిగ్గా సరిపోతుంది. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఓఎల్‌ఎక్స్‌ను ఎక్కువగా చూస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు వెంటనే వారికి ఫోన్ చేసి మోసం చేస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి నమ్మకం కుదిరిన తర్వాత వారి నేర్పు ప్రయోగిస్తున్నారు. ఈ విధంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలువురిని సైబర్ నేరస్థులు నిండాముంచారు. ఓఎల్‌ఎక్స్ సైబర్ నేరస్థులకు […] The post ఓఎల్‌ఎక్స్‌లో అమ్మినా…కొనుగోలు చేసినా కొట్టేస్తారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే సామెతా ఓఎల్‌ఎక్స్‌కు సరిగ్గా సరిపోతుంది. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఓఎల్‌ఎక్స్‌ను ఎక్కువగా చూస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు వెంటనే వారికి ఫోన్ చేసి మోసం చేస్తున్నారు.

నాలుగు మంచి మాటలు చెప్పి నమ్మకం కుదిరిన తర్వాత వారి నేర్పు ప్రయోగిస్తున్నారు. ఈ విధంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలువురిని సైబర్ నేరస్థులు నిండాముంచారు. ఓఎల్‌ఎక్స్ సైబర్ నేరస్థులకు అడ్డాగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు ట్రాక్టర్ విక్రయాని ఉండడంతో కింద ఉన్న ఫోన్ నంబర్‌లో సంప్రదించాడు. వెంటనే సైబర్ నేరస్థులు మాయమాటలు చెప్పి బాధితుడిని బుట్టలో వేసుకున్నారు. తాము ఆర్మీలో పనిచేస్తున్నామని డైరెక్ట్‌గా ట్రాక్టర్‌ను పంపివ్వడం కుదరదని మాయమాటలు చెప్పారు. దానికి ఆర్మీ నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లు రూ.1.50లక్షలు ఆన్‌లైన్‌లో పంపించాడు.

ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో తాను మోస పోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో ఓ విద్యార్థి వ్యాయామ కుర్చీని ఓఎల్‌ఎక్స్‌లో విక్రయానికి పెట్టాడు ఓ వైద్య విద్యార్థి. కూర్చీ కింద ఉన్న బాధితుడి ఫోన్ నంబర్‌కు వెంటనే ఫోన్ చేసిన సైబర్ నేరస్థులు తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రూ.20,000 నుంచి బేరం ఆడగా ఆఖరికి రూ.15,000కు బేరం కుదిరింది. ఇక్కడే అసలు నాటకం మొదలు పెట్టారు సైబర్ నిందితులు తాను ఆర్మీలో పనిచేస్తున్నానని ముందుగా డబ్బులు పంపించడం ఆర్మీ నిబంధనలకు విరుద్ధమని చెప్పాడు.

ముందుగా గూగుల్ పే ద్వారా రూ.10 పంపిస్తే డబుల్ పంపిస్తానని చెప్పాడు. బాధితుడు అలాగే చేయడంతో వెంటనే నిందితుడు రూ.20 పంపించాడు. ఇలాగే రూ.15,000 పంపిస్తే రూ.30వేలు పంపిస్తానని నమ్మించాడు. గతంలో రూ.20 గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడంతో నమ్మిన బాధితుడు రూ.15,000 పంపించాడు. ఈ విధంగా దశలవారీగా బాధితుడి నుంచి రూ.50,000 వసూలు చేశాడు. సైబర్ నేరస్థులు గూగుల్ పేను తమ నేరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. గూగుల్ పే ద్వారా డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు.

టెక్నికల్ సమస్యతో…
సైబర్ నేరస్థులు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపివ్వడంతో దానిని ఆసరగా చేసుకుని వారి ఖాతాల్లోని డబ్బులు మొత్తం కాజేస్తున్నారు. కొన్ని సార్లు టెక్నికల్ సమస్య వల్ల మీ డబ్బులు రాలేదని మళ్లీ పంపించండని కోరడంతో బాధితులు నమ్మి డబ్బులు పంపిస్తున్నారు. దీంతో బాధితులు లక్షలాది రూపాయలు కోల్పోతున్నారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఓఎల్‌ఎక్స్‌లో అమ్మినా…కొనుగోలు చేసినా కొట్టేస్తారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: