రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రంగారెడ్డి: కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ప్రయాణిస్తున్న లారీని కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. రైతులు వ్యాన్లలో కూరగాయలు తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం […] The post రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ప్రయాణిస్తున్న లారీని కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. రైతులు వ్యాన్లలో కూరగాయలు తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సిఐ జంగయ్య తెలిపారు.

One Death in Road Accident At Ranga Reddy

The post రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: