చైనాతో సరిహద్దుపై ట్రంప్‌తో మోడీ మాట్లాడలేదు

  మోడీ అసంతృప్తితో ఉన్నట్లున్నారు చైనాతో సరిహద్దు వివాదంపై ఆయనతో మాట్లాడా: ట్రంప్ వాషింగ్టన్: భారత్‌చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా తీరుపై ప్రధాని అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్, చైనాల మధ్య ‘పెద్ద ఘర్షణ’ తలెత్తినట్లు వ్యాఖ్యానించారు. ‘భారత్‌చైనా మధ్య పెద్ద ఘర్షణ తలెత్తింది. రెండూ చెరో 1.4 బిలియన్ల జనాభా […] The post చైనాతో సరిహద్దుపై ట్రంప్‌తో మోడీ మాట్లాడలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మోడీ అసంతృప్తితో ఉన్నట్లున్నారు

చైనాతో సరిహద్దు వివాదంపై ఆయనతో మాట్లాడా: ట్రంప్

వాషింగ్టన్: భారత్‌చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా తీరుపై ప్రధాని అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్, చైనాల మధ్య ‘పెద్ద ఘర్షణ’ తలెత్తినట్లు వ్యాఖ్యానించారు. ‘భారత్‌చైనా మధ్య పెద్ద ఘర్షణ తలెత్తింది. రెండూ చెరో 1.4 బిలియన్ల జనాభా కలిగిన దేశాలు. అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు భార త్ కానీ, అటు చైనా కానీ సంతోషంగా ఉన్నట్లు కనిపించడంలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరో వైపు ఈ వివాదంలో ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్ తేల్చి చెప్పినప్పటికీ ఇరు దేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాని మరోసారి ట్రంప్ వ్యాఖ్యానించారు.

సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చైనాతో సంప్రతింపులు సాగిస్తున్నట్లు భారత్ గురువారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో దేశ భద్రత, సార్వభౌమత్వానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పరోక్షంగా ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. మరో వైపు చైనా కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. మోడీ ఒక గొప్ప నాయకుడని, ఆయన చాలా గొప్పగా పని చేస్తున్నారని అన్నారు.

‘ఆ విషయమై వారిద్దరూ మాట్లాడుకోలేదు’
చైనాతో సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోడీతో మాట్లాడానని అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు విభేదించాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇటీవలి కాలంలో ఎలాంటి సంభాషణ చోటు చేసుకోలేదని ఆ వర్గాలు స్పష్టం చేశారు. ఏప్రిల్ 4న హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్న తర్వాత వారి మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకోలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

PM Modi not talks with Trump on India-China border

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చైనాతో సరిహద్దుపై ట్రంప్‌తో మోడీ మాట్లాడలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: