ఎంపి వైపు మిడతలు

  నాగపూర్‌లోని రాంటెక్ నుంచి గాలి వాటపు పయనం మన తెలంగాణ/హైదరాబాద్ : మిడతల దండు మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాంటెక్ నుంచి దిశ మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు ప్రయాణిస్తోంది. దండు చత్తీస్‌గడ్ వైపు వెళ్తుందని ముందుగా అంచనా వేసినప్పటికీ, గాలి దిశకు అనుగుణంగా మళ్లీ పైవైపు వెళ్తున్నట్ల జోధ్‌పూర్ లోకస్ట్ వార్నింగ్ సెంటర్ తెలిపిందని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా మిడతల దండు వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి దిశ మార్చుకోవడంతో […] The post ఎంపి వైపు మిడతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగపూర్‌లోని రాంటెక్ నుంచి గాలి వాటపు పయనం

మన తెలంగాణ/హైదరాబాద్ : మిడతల దండు మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాంటెక్ నుంచి దిశ మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు ప్రయాణిస్తోంది.

దండు చత్తీస్‌గడ్ వైపు వెళ్తుందని ముందుగా అంచనా వేసినప్పటికీ, గాలి దిశకు అనుగుణంగా మళ్లీ పైవైపు వెళ్తున్నట్ల జోధ్‌పూర్ లోకస్ట్ వార్నింగ్ సెంటర్ తెలిపిందని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా మిడతల దండు వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి దిశ మార్చుకోవడంతో రైతు లు, అధికారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఒకవేళ గాలి దిశ మారితే, మళ్లీ ఇటువైపు వస్తుందా ? లేదా అనేది తెలియాల్సి ఉంటుందన్నారు.

అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మిడతలు వచ్చినట్లు వస్తున్న వార్తలు, వీడియోలు పూర్తి అవాస్తవమన్నారు. సాధారణ మిడతలు ఉంటాయని, అయితే దండుగా వచ్చేవి మాత్రం ఏడారి మిడతలని వివరించారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సాధారణంగానే ప్రతిసారి కొంతమేర పంట నష్టం వీటితో వస్తుందని, అయితే అవి ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో పరిస్థితి తీవ్రంగా పరిణమించిందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఒకవేళ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తే నష్టం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా కమిటీ మెంబర్లను ముగ్గురిని రామగుండంకు పంపించినట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్ బొజ్జా మన తెలంగాణకు తెలిపారు. పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్‌లతో కెమికల్స్ పిచికారీ చేయాల్సి ఉంటుందని అందుకు అనుగుణంగా అటవీ మార్గంలో ప్రయాణంపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి విపత్తు రానందున అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

ఏడు జిల్లాలకు ఏడు వేల లీటర్లు
ఒకవేళ మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అడ్డుకునేందుకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వెయ్యి లీటర్ల చొప్పున ఏడు వేల లీటర్ల రసాయనాలు సిద్ధంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సెంటల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డు అనుమతి పొందిన మలాథీయన్ 50% ఇసి 740 ఎం.ఎల్, మలాథీయన్ 20% డబ్లుపి 1.48 కిలోలు, క్లోరోఫిరిఫోస్ 20% ఇసి 480 ఎంఎల్, క్లోరోపిరిఫోస్50% ఇసి 192 ఎంఎల్, లాంబ్డ సైలొర్థిన్ 5% ఇసి 160 ఎంఎల్, లాంబ్డ సైలొర్థిన్ 10% వంటివి సిద్ధంగా పెట్టుకున్నారు.

కంటిన్‌జెన్సీ ప్రణాళిక విడుదల చేసిన కేంద్రం
ఏడాది మిడతల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ శాఖ కంటిన్‌జెన్సీ ప్రణాళికను విడుదల చేసింది. మిడతలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో వివరించారు. సర్వే టీమ్స్, ముంద స్తు ప్రణాళికలు, కంట్రోల్ టీమ్స్, సప్లై టీమ్, మెయింటెనెన్స్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అందులో సూచించారు.

మిడతల దండుతో విమానాలకూ ముప్పు
మిడతల దండు వల్ల గాల్లో ఎగిరే విమానాలకు సైతం ముప్పు పొంచి ఉందని, అందుకే విమాన సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విమానయాన నియంత్రణ సంస్థ(డిజిసిఎ) శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. క్లిష్టమైన ల్యాండింగ్, టేకాఫ్ దశలలో ఈ మిడతల దండుతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘సాధారణంగా మిడతలు తక్కువ ఎత్తులోనే ఎగురుతాయి. అందువల్ల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాలకు ప్రమాదం ఉంటుంది.

పెద్ద సంఖ్యలో మిడతలు ఇంజిన్ ఇన్‌లెట్, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్‌లెట్‌లో చొరబడే అవకాశం ఉంది. పిటాట్, స్టాటిక్ వంటి భాగాలను పాక్షికంగా లేదా పూర్తిగా మూసి ఉంచాల’ని డిజిసిఎ పేర్కొంది. విమానాల్లో పిటాట్ నాళాన్ని గాలి వేగాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు. వీటిని మూసి ఉంచటం ద్వారా గాలి, ఎత్తు సూచీల్లో తప్పులు చూపించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని డిజిసిఎ స్పష్టపరుస్తోంది. భారత్‌లో 21 ఏళ్ల తర్వాత ఎడారి మిడతలు దండేత్తాయి. రాజస్థాన్‌లో మొదలై పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు విస్తరించాయి.

ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్‌కు బాధ్యతల అప్పగింత
ఈ నేపథ్యంలో ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ సిబ్బందికి పలు బాధ్యతలను అప్పగించారు. మిడతలు గాల్లో కనిపించి నప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎంత దూరం నుండి వాటి ప్రయాణాన్ని కనుక్కోవాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చే దిశగా విమానయాన సంస్థ సన్నాహలు చేస్తోంది.

Locust swarms entered ramtek in Nagpur district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎంపి వైపు మిడతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: