కొండ గోదారమ్మ

  రైతాంగానికి త్వరలో తీపి కబురు దేశం ఆశ్చర్యపడేలా శుభవార్త అందిస్తా వేచి చూడండి ఇది రాష్ట్ర చరిత్రలో అపూర్వ ఘట్టం: సిఎం కెసిఆర్ తెలంగాణ మాగాణంలో అద్భుత జలావిష్కరణ 618 మీటర్ల ఎత్తుకు ఎగసి కొండపోచమ్మ ఒడిలో దూకిన గంగ జనజయధ్వానాల మధ్య ప్రారంభించిన సిఎం కెసిఆర్ ప్రత్యేక అతిథిగా హాజరైన చినజీయర్‌స్వామి చండీ, సుదర్శన యాగాల నిర్వహణ కొండపోచమ్మ ఆలయంలో కెసిఆర్ దంపతుల ప్రత్యేక పూజలు ఆరింటిలో ఒక మోటార్ స్విచ్ ఆన్‌చేసి ప్రాజెక్టును […] The post కొండ గోదారమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రైతాంగానికి త్వరలో తీపి కబురు

దేశం ఆశ్చర్యపడేలా శుభవార్త అందిస్తా వేచి చూడండి

ఇది రాష్ట్ర చరిత్రలో అపూర్వ ఘట్టం: సిఎం కెసిఆర్

తెలంగాణ మాగాణంలో అద్భుత జలావిష్కరణ

618 మీటర్ల ఎత్తుకు ఎగసి కొండపోచమ్మ ఒడిలో దూకిన గంగ

జనజయధ్వానాల మధ్య ప్రారంభించిన సిఎం కెసిఆర్
ప్రత్యేక అతిథిగా హాజరైన చినజీయర్‌స్వామి
చండీ, సుదర్శన యాగాల నిర్వహణ
కొండపోచమ్మ ఆలయంలో కెసిఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
ఆరింటిలో ఒక మోటార్ స్విచ్ ఆన్‌చేసి ప్రాజెక్టును ప్రారంభించిన కెసిఆర్

నాడు అనాథ.. నేడు పసిడి ధాన్యరాశుల తెలంగాణ
దీక్ష గల రైతాంగం ఉంటేనే పల్లెలు సుసంపన్నం
నియంత్రిత సాగు విధానంతో అద్భుత ఫలితాలు
భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి
రానున్న రోజుల్లో సంవత్సర కాలంలో
లక్ష కోట్ల రూపాయల పంట చేతికి
కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్/సిద్ధిపేట : తెలంగాణ రైతాంగానికి త్వరలోనే తీపి కబురు అందిస్తానని, భారతదేశం ఆశ్చర్యపోయేలా ఈ శుభవార్త ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దీని కోసం అందరూ వేచి ఉండా లని ఆయన తెలిపారు.

కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ అద్భుతమైన రైతాంగం ఉం టేనే పల్లెలు సుసంపన్నంగా ఉంటాయన్నారు. రైతురుణ మాఫీని సైతం తూ.చా. తప్ప కుండా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన తెలిపారు. 5,60,000ల మంది రైతాంగానికి (రూ.25 వేల) రుణమాఫీ నిమిత్తం రూ.1 300 కోట్లను విడుదల చేశామన్నారు. గొప్ప రైతాంగాన్ని తీర్చిది ద్దడమే ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ రైతాంగం గొప్పగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో నియంత్రిత సాగు విధానాన్ని అవలంభించి అద్భుత ఫలితాలు సాధిస్తామన్నారు.

ఈ నేపథ్యంలో రైతాంగానికి అద్భు తమైన అండదండలు అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే వేలాది గ్రామాల రైతులు తాము సూచించిన నియంత్రిత సాగు విధానం నచ్చి తీర్మానాలు చేస్తున్నాయన్నారు. పాత మెదక్ జిల్లాల్లో 900 గ్రామాల రైతులు ఇప్పటికే తీర్మానం చేశారని ఆయన తెలిపారు. దేశానికి మనం ఆదర్శం కావాలని, కెసిఆర్ పట్టుబడితే అది మొండి పట్టేనన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

తెలంగాణ ప్రజల కల సాకారం
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో అపూర్వమైన ఘట్టమని, ఇది అపూరూపమైన ప్రాజెక్టు అని సిఎం కెసిఆర్ కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఉజ్వలమైన ఘట్టమన్నారు. ఏ లక్ష్యాన్ని, ఏ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు కోట్లాడారో ఆ కల సంపూర్ణంగా సాదృశ్యంగా సాకారమైన గొప్ప ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఇది వందలాది పంపుసెట్లతో ఏర్పాటయ్యిందన్నారు.

కాళేశ్వరానికి చెందిన 10 లిప్ట్ కింద కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం జలాలు ప్రవహించాయన్నారు. అందరికన్నా ముందు తాను ధన్యవాదాలు తెలిపేది కాళేశ్వరం బ్యారేజీ మొదలు కొండపోచమ్మ బ్యారేజీ వరకు ఎవరైతే భూములు కోల్పోయిని నిర్వాసితులు ఉన్నారో వారి త్యాగాలు వెలకట్టలేనివని ఆయన తెలిపారు. వారందరికి శిరస్సువంచి ధన్యవాదాలు తెలియచేశారు. వారి త్యాగం వల్లే ఈరోజు లక్షలాది ఎకరాలకు నీళ్లు పారే అవకాశం లభించిందన్నారు.

నిర్వాసితుల కోసం అద్భుతమైన కాలనీ నిర్మాణం
ముఖ్యంగా కొండపోచమ్మ ప్రాజెక్టులో మామిడ్యాల, బైలంపోరు, తానదారేపల్లి గ్రామాల ప్రజలు సంపూర్ణంగా ఇందులో భాగస్వాములయ్యారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మంత్రి హరీష్‌రావు నాయకత్వంలో భూములు ఇచ్చిన నిర్వాసితుల కోసం తునికబొల్లారంలో అద్భుతమైన కాలనీని (గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల మాదిరిగా) కట్టించారని సిఎం కెసిఆర్ తెలిపారు. గతంలో మాట ఇచ్చిన మాదిరిగా నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, అందులో భాగంగానే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌ను నెలకొల్పుతామని, దీనికి సంబంధించి భూ సేకరణ కూడా (100 నుంచి 200 ఎకరాల) జరిపామని ఆయన తెలిపారు.

సిద్దిపేట ఎస్‌ఈజెడ్‌లో ఉద్యోగ అవకాశాలు
సిద్దిపేట్ ఎస్‌ఈజెడ్‌లో (ఫుడ్ ప్రాసెసింగ్)లో నిర్వాసితుల పిల్లలకు అవకాశం వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి సంపూర్ణ సానూభూతి ఉందన్నారు. వారు చేసిన సాయం వల్లే ఈ ప్రాజెక్టులన్నీ సాకారం అయ్యాయన్నారు. రంగనాయక్‌సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్‌మానేరు ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మంచి పరిహారం చెల్లించామని అయినా నిర్వాసితులు గూడు చెదిరిన పక్షుల మాదిరిగా మారారని, ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు.

6 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణం… న్యూ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం
గజ్వేలో ప్రాంతంలో మరో ప్రత్యామ్నాయ న్యూ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం అవుతుందని సిఎం పేర్కొన్నారు. 6 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణం (600 పైచిలుకు ఎకరాల్లో) కొనసాగుతుందని, అవి వివిధ దశల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో సకల సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి ప్లానింగ్ నుంచి మొదలుకుంటే ఇంత సాహోసోపేతంగా, మల్టీ స్టేజీ లిఫ్టింగ్ ఆఫ్ సోమెనీ టిఎంసి వాటర్ నిల్వ చేసుకునే విధంగా తయారయ్యేకాదనీ, దీనిని జోక్‌గా తీసుకోవద్దని సిఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో రెండో అతి పెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్
కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ (సెకండ్ లార్జెస్ట్ ఇరిగేషన్‌ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టు) అతి పెద్దదని, మల్లన్నసాగర్ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతి పెద్ద ప్రాజెక్టు అని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి తరువాత 50 టిఎంసిల కెపాసిటీ మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. నూతనంగా నిర్మించబడిన రిజర్వాయర్, బ్యారేజీలు కలుపుకుంటే 40 టిఎంసిలు బ్యారేజీల్లో నీరు నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇవి కాకుండా బయట నిర్మించిన ప్రాజెక్టుల కెపాసిటీ 125 టిఎంసిలని ఆయన తెలిపారు.

కామారెడ్డి, ఎల్లారెడ్డి, కాటేవాడి, గుజ్వల్ తదితర ప్రాంతాల్లో 125 టిఎంసిలకు సంబంధించిన రిజర్వాయర్‌లు ఉన్నాయన్నారు. సిద్దిపేట రంగనాయకిసాగర్, అన్నపూర్ణ బ్యారేజీ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్‌లలో కలిపితే 125 టిఎంసిలు, బ్యారేజీలలో 40 టిఎంసిలను కలిపితే మొత్తంగా 165 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునేలా వీటి నిర్మాణం జరిగిందన్నారు. ఇది ఏ రాష్ట్ర చరిత్రలో జరగలేదని, మూడు, నాలుగు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తిచేసిన దాఖలాలు లేవని, ఇది కష్టమైన పని అయినా తెలంగాణ ప్రభుత్వ దీనిని సాధ్యం చేసి చూపించిందన్నారు.

ఎఫ్‌సిఐ 53 లక్షల ధాన్యం సేకరణ
రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, ఎలా ముందుకుపోవాలి, రైతులకు మద్ధతు ధర ఎంత ఇవ్వాలన్న దానిపై రెండురోజుల క్రితం సమావేశం నిర్వహించామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. లక్ష కోట్ల రూపాయల పంటను (సంవత్సర కాలంలో) తెలంగాణ రైతాంగం పండించపోతుందని, ఇది చాలా గర్వకారణమన్నారు. దేశంలో 83 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరిస్తే అందులో 53 లక్షల ధాన్యాన్ని రాష్ట్రం నుంచి సేకరించినట్టు రెండు రోజుల క్రితం ఎఫ్‌సిఐ సిఎండి డివి ప్రసాద్ తెలిపారన్నారు. 63 శాతం ధాన్యాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఎఫ్‌సిఐ సేకరించిందని గణాంకాలు చెబుతున్నాయని, ఇది తెలంగాణ రైతాంగానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

‘తలాపున పారుతుంది గోదారి మన చెల్క, మన చేను ఎడారి’
ఆరు సంవత్సరాల క్రితం తెలంగాణ అనాధని, ‘పల్లెపల్లెలో పల్లెర్లు మెలిచే’, ‘తలాపున పారుతుంది గోదారి మన చెల్క, మనచేను ఎడారని’ తెలంగాణ కవులు పాటలు పాడేవారని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం పసిడి పంటల తెలంగాణగా మారిందన్నారు. ఒకనాడు ఎడుపు పంటల తెలంగాణ, నేడు పసిడి ధాన్యం రాశుల తెలంగాణగా మారిందన్నారు.

కితాబునిచ్చిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ
జీవితంలో మనుషులకు కొన్ని అరుదైన అవకాశాలు వ స్తాయని, తన జీవితంలో కూడా ప్రత్యేక సందర్భం వచ్చిందన్నారు. ఉద్యమాలు ప్రారంభించిన చాలామంది మధ్యలో వెళ్లిపోతారని, మిగతా వాళ్ల నాయకత్వంలో ఫలితం వస్తుందని, కానీ ఈ విషయంలో నీవు అదృష్టవంతుడివని, ప్రత్యేక రాష్ట్రం సాధించావని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తనకు కితాబునిచ్చినట్టుగా సిఎం తెలిపారు.

ప్రపంచం అబ్బురపడేలా ఇంజనీర్ల కృషి
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కుట్రలు చేసినా అనితర సాధ్యంగా ప్రపంచమే అబ్బురపడేలా ఇంజనీర్లు అద్భుతంగా కాళేశ్వర ప్రాజెక్టును తీర్చిదిద్దారన్నారు. 88 మీటర్ల లెవల్ నుంచి 618 మీటర్ల లెవల్స్‌కు ఎగిసిపడి నేడు కొండపోచమ్మ సాగర్ నిండుతుందని ఆయన తెలిపారు. ఇది చాలా అద్భుతమని ఇది తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శమన్నారు. తెలంగాణ వాళ్లకు తెలివిలేదు, పనిచేయరాదు, పనిచేతకాదు, పరిపాలన రాదన్న వారికి తమ ఇంజనీర్లు ఎంత శక్తివంతులో తెలిసేలా కాళేశ్వరం ప్రాజెక్టు తయారయ్యింద న్నారు. తెలంగాణ ఇంజనీర్ కమ్యూనిటీకి, ఈఎన్సీ బృందానికి శాల్యూట్ చేస్తున్నానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుకు సుమారు 4,800 పైచిలుకు మెగావాట్లు విద్యుత్ శక్తి వినియోగం
ఈ ప్రాజెక్టు కోసం సుమారు 4,800 పైచిలుకు మెగావాట్లు (విద్యుత్ శక్తి)ని వినియోగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఈ శక్తి అందుబాటులో ఉంచాలంటే ఇది మాములు విషయం కాదన్నారు. గతంలో గజ్వేల్‌కు 400 మెగావాట్ల సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే 12 సంవత్సరాలు పట్టిందని ఆయన తెలిపారు. కానీ, కొండపోచమ్మ సాగర్‌లో చాలా అద్భుతంగా కనివినీ ఎరుగని రీతిలో, దేశ చరిత్రలో కట్టని రీతిలో ఆరు 400 కెవి సబ్‌స్టేషన్‌ల నిర్మాణం జరిగిందని, ఏడు 220 సబ్‌స్టేషన్స్, రెండు 132 సబ్‌స్టేషన్స్‌ల నిర్మాణాలు జరిగాయని సిఎం కెసిఆర్ తెలిపారు.

దీంతోపాటు 521 కి.మీల కొత్త లైన్‌లను కూడా వేసినట్టు ఆయన తెలిపారు. అనేక కష్ట, నష్టాలకు ఓర్చిన విద్యుత్ శాఖతో పాటు భూ సేకరణ విషయంలో రెవెన్యూ శాఖ కృషి కూడా ఉందన్నారు. వర్కింగ్ ఏజెన్సీస్ చాలా గొప్పగా పనిచేశాయన్నారు. ఇండియాలో ఉన్న కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యాయన్నారు. ఎల్ ఎండ్ టి, షాపుర్ జీ పల్లమ్ జీ, మెగా, నవయుగ, ఎఎన్‌ఆర్, ఎఎంఆర్ లాంటి కంపెనీలో ఇందులో వివిధ దశల్లో పాలు పంచుకున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు.

వలస కార్మికుల కోసం రూ.12 కోట్ల ఖర్చు
వలసకార్మికులను వారి రాష్ట్రాలను తరలించడానికి ప్రత్యే క రైళ్లను ఏర్పాటు చేయించడంతో పాటు దాని కోసం రూ.12 కోట్లను ఖర్చు చేశామని సిఎం తెలిపారు. కార్మికులకు పండ్లు, భోజనం, దారి ఖర్చులను కూడా ఇచ్చామన్నారు. వారందరూ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారన్నారు. 48 డిగ్రీల ఎండలో వారు ఈ ప్రాజెక్టు వద్ద పనిచేశారని, వారు చేస్తున్న పనిని చూసి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసి వచ్చానని సిఎం కెసిఆర్ తెలిపారు. పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన కూలీలు మండుటెండలో పనిచేశారని సిఎం పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చెమట చుక్కలు వదిలిన ప్రతి ఒక్క కార్మికుడికి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో జర్నలిస్టు మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏ మంచిపని జరగాలన్నా, పాజిటివ్ దృక్పథం కావాలన్నారు. ప్రతిచోట విమర్శించే వారు ఉంటారని, కానీ వాటన్నింటికి జవాబే ఫలితమేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రం 165 టిఎంసిల కొత్త సామర్థాన్ని తెచ్చుకుందన్నారు. దుమ్ముగూడం దగ్గర సీతమ్మ సాగర్ (37 టిఎంసిల నిర్మాణంతో), సమ్మక్కసాగర్ 7.5 టిఎంసిల దేవాదుల ప్రాజెక్టు కోసం నిర్మాణం జరుగుతోందన్నారు.

అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది
తెలంగాణ రాష్ట్రం కోసం తాను చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చానని, ఈ విషయం అందరికీ తెలుసని సిఎం పేర్కొన్నారు. నాతోపాటు ఉద్యమంలో పనిచేసిన సహచరులు ఉద్యమంలో ప్రాణాలను బలిదానం చేశారని, వారు వెలకట్టలేని ప్రాణత్యాగం చేశారని అందులో భాగంగానే అమరవీరులను స్మరించుకుంటున్నామన్నారు.

పోరుగు రాష్ట్రాలతో గొడవలు లేకుండా…
10 స్టేజీల లిఫ్ట్ ఇరిగేషన్, 530 టిఎంసిల నీటిని వాడుకోగల శక్తిని, సామర్థాన్ని ఈరోజు తెలంగాణ సాధించిందన్నారు. అందులో భాగంగా మహరాష్ట్రతో చేసుకున్న ఒప్పందంలో గొప్ప రాజనీతిజ్జను ప్రదర్శించామన్నారు. పోరుగు రాష్ట్రాలతో గొడవలు లేకుండా వారిని ఒప్పించి, మెప్పించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆయా రాష్ట్రాల సిఎంలు వచ్చి పాల్గొనడం సంతోషకరమన్నారు.

సాంఘిక, సంక్షేమం విషయంలో రాష్ట్రం ముందంజ
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుసంపన్నులుగా మారాలన్నదే తన ధ్యేయమని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఇది తన కల అని, దానిని రోజురోజుకు సాకారం చేయడానికి ముందుకెళుతున్నానన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు దుర్మార్గంగా కరెంట్ కోతలు ఉండేవని, ఆ కష్టాల నుంచి తెలంగాణ శాశ్వతంగా గట్టెక్కిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో మంచినీటికి కొరత లేదని, ఖాళీ బిందెల ప్రదర్శన బంద్ అయ్యిందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమపంథా రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. దేశం గర్వించే విధంగా సాంఘిక, సంక్షేమం విషయంలో రాష్ట్రం ముందుకుపోతుందన్నారు. రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు.

మంజీరానది, హల్దీవాగులు ఎండిపోకుండా ప్రణాళికలు
24 గంటలు కరెంట్ చార్జీలు లేకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న రూ.290 కోట్ల నీటి తీరువాను రద్దు చేశామన్నారు. కాళేశ్వరం నీటిని కూడా రైతులకు ఉచితంగానే సరఫరా చేస్తామని కెసిఆర్ తెలిపారు. రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లిస్తుందని కెసిఆర్ తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రైతాంగానికి కెసిఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేశారు. జహీరాబాద్‌కు ఈ నీరు అందేలా సింగూరు నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి బ్రహ్మండంగా నీటిని అందిస్తామని ఆయన తెలిపారు. ఎండిపోని మంజీరానదిని, హల్దీవాగులను త్వరలో చూడనున్నట్టు ఆయన తెలిపారు. మంజీరానది కింద 15 చెక్‌డ్యామ్‌లను మంజూరు చేశామని, వాటిలో చాలావరకు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

రూ.4,000కోట్లు… 1,200 చెక్‌డ్యాంల నిర్మాణం
రూ.4,000 కోట్లలతో 1,200 చెక్‌డ్యాంలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేపట్టామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇంత కష్టపడి తీసుకొచ్చిన నీటిని గోదారి పాలు చేయకుండా కొత్త చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచామని ఆయన తెలిపారు. దీనివలన జీవవైవిద్యం పెరుగుతుందని, ఇప్పటికే భూగర్భజలాలు పెరిగాయన్నారు. నాగార్జునసాగర్ కాలువ 11 వేల క్యూసెక్కుళ్లు ఉండగా, ఈ కెనాల్ 11,500 క్యూసెక్కుళ్లని ఆయన తెలిపారు.

మల్లన్నసాగర్ మర్కూజ్ పంపుహౌస్ వరకు మొత్తం 28 కి.మీల దూరమని, 23 కి.మీల వరకు 1 టిఎంసి నీరు వస్తుందని ఎవరూ అక్కడ ఈతకొట్టడానికి వెళ్లవద్దని కెసిఆర్ సూచించారు. ఈ విషయాన్ని సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన విలేకరులు ప్రజలకు తెలిసేలా వార్తలు రాయాలని కెసిఆర్ సూచించారు. పిల్లలు స్నానాలు చేయడానికి ఘాట్‌లను కట్టించాలని సిఎం మంత్రి హరీష్‌రావు, కలెక్టర్‌లకు కెసిఆర్ సూచించారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొండ గోదారమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: