మేఘా ప్రపంచ రికార్డు!

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లలో 3767 మెగావాట్ల పంపింగ్ సామర్థం పూర్తి భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధికంగా పంపింగ్ కేంద్రాల ఏర్పాటు హైదరాబాద్ : గోదావరి జలాలతో తెలంగాణ ధాన్యాగారంతో రూపుదిద్దుకునేందుకు చేపట్టిన కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలోని కీలకమైన పనులను మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) రికార్డ్ సమయంలో పూర్తి చేసి ఘనత దక్కించుకుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తిపోతల పథకంలోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను ఈసంస్థ పూర్తిచేసి తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, […] The post మేఘా ప్రపంచ రికార్డు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లలో 3767 మెగావాట్ల పంపింగ్ సామర్థం పూర్తి
భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధికంగా పంపింగ్ కేంద్రాల ఏర్పాటు

హైదరాబాద్ : గోదావరి జలాలతో తెలంగాణ ధాన్యాగారంతో రూపుదిద్దుకునేందుకు చేపట్టిన కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలోని కీలకమైన పనులను మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) రికార్డ్ సమయంలో పూర్తి చేసి ఘనత దక్కించుకుంది.

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తిపోతల పథకంలోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను ఈసంస్థ పూర్తిచేసి తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలోని కీలకమైన పనులను, అత్యధిక పంపింగ్ కేంద్రాలను రికార్డ్ సమయంలో పూర్తి చేసి ఈ ఘనతను దక్కించుకుంది. మొత్తం 22 పంపింగ్ కేంద్రాలలో 96 మెషిన్లు 4680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో 15 కేంద్రాలలో 89 మెషిన్లను మెగావాట్ల 3840 సామర్థ్యంతో నిర్మిస్తోంది.

పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్-..1,లింక్…-2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎంఇఐఎల్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3767 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. ఈ ప్రక్రియలో సిఎం కెసిఆర్ పట్టుదల, నీటిపారుదల శాఖ నిరంతర పర్యవేక్షణకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు, బిహెచ్‌ఇఎల్, ఆండ్రిజ్, జైలం, ఎబిబి, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు భాగస్వామ్యం పంచుకున్నాయి.

రికార్డు సమయంలో 3767 మెగావాట్లు
తాజాగా ప్యాకేజ్…-14లోని పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా 3767 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. ఇంజనీరింగ్ చరిత్రలో ఇది ఒక అద్భుతం. నీటి పారుదల రంగంలో ఎత్తైన ప్రాంతానికి దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌చేసే విధంగా భారీ ఎత్తిపోతల పథకం పూర్తిచేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్‌మేడ్ రివర్ రూపుదిద్దుకుంది.

వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పెద్దది. కాగా ఆ పథకంతో పోలికలేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇంజనీరింగ్ నిపుణులు సైతం అబ్బురపరిచే విధంగా పనులు రికార్డ్ సమయంలో పూర్తయ్యాయి. మొత్తం పంపింగ్ కేంద్రాల్లో అత్యధిక (15) కేంద్రాలను (భూ ఉపరితలంపైన 11,భూఅంతర్భాగంలో 4) ఎంఇఐఎల్ నిర్మించింది. రోజుకు 2 టిఎంసిల నీటిని పంప్‌చేసే విధంగా నిర్మించిన కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వాటిని ఈ సంస్థ నిర్మించింది.

వీటిలో 9 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. మరో నాలుగు పంపింగ్ కేంద్రాలు ఎంఇఐఎల్ పరంగా పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తయిన పంపింగ్ కేంద్రాలతో 3763 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. 35.4మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలు పూర్తయ్యాయి. మరో 41మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం మీద మేఘా ఇంజనీరింగ్ రోజుకు 2 టిఎంసిల సామర్థ్యం కింద 3840మెగావాట్ల సామర్థ్యం కలిగిన పనులను చేపట్టింది.

భూగర్భంలో నిర్మించిన పంపింగ్ కేంద్రాలు
అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్..-8), అన్నపూర్ణ (ప్యాకేజ్…-10), రంగనాయక సాగర్ (ప్యాకేజ్…-11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్-..12) భూగర్భంలో నిర్మించినవే. ఇందులో ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3 ఘనప మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్‌పూల్, అదనపు సర్జ్‌పూల్స్ కూడా ప్రపంచంలోనే పెద్దవి.

ఈ ప్రాజెక్ట్‌లో లింక్..-1, లింక్..-2 పంప్‌హౌస్‌లు చాలా కీలకమైనవి. లింక్-..1లో ప్రాణహిత జలాలను గోదావరిలోకి అంటే శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి జలాశయంలోకి తీసుకురావడం. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28 మిషన్‌లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు. ఆ తర్వాత ప్యాకేజ్-..8 పంపింగ్ కేంద్రం గాయత్రి.

ప్రపంచంలోనే అతి పెద్దది
భూగర్భంలో – గాయత్రి నిర్మాణం గాయత్రి (ప్యాకేజ్-8) పంపింగ్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతవరకు ఒక పంపింగ్ కేంద్రం ఇంత పెద్ద సామర్థ్యంతో అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించడం ఇంజనీరింగ్ అద్భుతం. ఇంజనీరింగ్ రంగంలో ఈ పంపింగ్ కేంద్రం ప్రపంచంలో ఎక్కడా లేనిదిగా ప్రసిద్ధికెక్కింది. జంట టన్నెల్స్ తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జిపూల్స్ ఇందులోని ప్రత్యేకత. ఈ అల్ట్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 మెషీన్లతో రోజుకు 2 టిఎంసిలనీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు.

ఈ మెషీన్లను కంప్యూటేషనల్ ఫ్ల్యూయిడ్ డైనమిక్స్ (సిఎఫ్‌డి) టెక్నాలజీతో దేశంలో తయారు చేసి మేక్ ఇన్ ఇండియాకు ప్రతిరూపం. ఈ పంపింగ్ కేంద్రంలో నిర్మించిన సర్జ్‌పూల్స్ ఈఫిల్ టవర్ కన్నా పొడవులో పెద్దది. ఒక్కొక్కటి సుమార్ 3000 క్యూసెక్కుల నీటిని 111 మీటర్ల ఎగువకు పంప్‌చేసే విధంగా భూగర్భంలో ఈ ప్రాజెక్ట్‌ను మేఘా ఇంజనీరింగ్ నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని భూగర్భంలో ఇంత భారీ ఎత్తున నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

470 అడుగుల దిగువన 327 మీటర్లు పొడవు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తుతో ఈ పంప్ హౌస్ నిర్మాణం అంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2 టిఎంసిల నీటి పంపింగ్‌కు గాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తున్న 89మిషన్‌లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తుందంటే కాళేశ్వరంలో మేఘా పాత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రంగనాయక సాగర్‌లో రెండో అత్యధిక సామర్థ్యం
ప్యాకేజ్…-11లోని రంగనాయక సాగర్‌లో ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 మిషన్‌లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 4 యూనిట్ల ద్వారా 536 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం ఏర్పాటయ్యింది. ఒక్కొక్క మిషన్ సామర్థ్యం వారిగా పరిశీలిస్తే గాయత్రి పంప్‌హౌస్ మిషన్ తర్వాత రంగనాయక సాగర్ (ప్యాకేజ్-11) ప్రపంచంలో రెండవ అతిపెద్ద సామర్థ్యం తో 2వ సామర్థ్యం కలిగిన పంపింగ్ యూనిట్ పేరుగాంచిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాలు పంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టమన్నారు.

భారీ విద్యుత్ వ్యవస్థ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. అది ఎంతపెద్దదంటే.. 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 15,087 మెగావాట్లు. దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఇఐఎల్ ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థలో 25 శాతం ఉందంటే ఇది ఎంత భారీ వ్యవస్థనో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4680 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, ఇందులో అత్యధికంగా 3840 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడు ఈశాన్యరాష్ట్రాల విద్యుత్ సరఫరా సామర్థ్యం (3916 మెగావాట్లు), కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఇఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానం.

ప్యాకేజ్…14 ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్-…14 అనేది ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టుగా శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు అని, ఇందులో రెండు పంపు హౌస్ లు ఉన్నాయన్నారు. 10.5 కిలో మీటర్ల కెనాల్ , మొత్తం 15 స్ట్రక్చర్లున్నాయి. మొదటి పంప్ హస్‌లో 3.7 కిలో మీటర్ల కెనాల్ అలాగే రెండవ పంప్ హౌస్‌లో 6.75 కిలోమీటర్ల కెనాల్ పనులు పూర్తయ్యాయి. మొదటి హౌస్‌లో 7, రెండవ పంప్ హౌస్ లో 8 స్ట్రక్చర్లున్నాయి. మొదటి పంప్ హౌస్‌లో మొత్తం 6 మెషీన్లున్నాయి. ఒక్కో మెషీన్ సామర్థ్యం 27 మెగావాట్లు రెండవ పంప్ హౌస్ లో మొత్తం 6 మెషీన్లున్నాయి. ఒక్కో మెషీన్ సామర్థ్యం 34 మెగావాట్లు అని ఆయన తెలిపారు.

MEIL completes 3,767 MW pumping capacity for Kaleshwaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మేఘా ప్రపంచ రికార్డు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: