జూన్1న కేరళకు నైరుతి రుతుపవనాలు

చల్లటి కబురు చెప్పి వాతావరణ శాఖ న్యూఢిల్లీ: నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకనున్నాయని ప్రకటించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు మామూలుకన్నా నాలుగైదు రోజులు ఆలస్యంగా జూన్ 5 నాటికి కేరళను తాకుతాయని వాతావరణ విభాగం ఇంతకు ముందు అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 31 జూన్ మధ్య కాలంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం […] The post జూన్1న కేరళకు నైరుతి రుతుపవనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
చల్లటి కబురు చెప్పి వాతావరణ శాఖ

న్యూఢిల్లీ: నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకనున్నాయని ప్రకటించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు మామూలుకన్నా నాలుగైదు రోజులు ఆలస్యంగా జూన్ 5 నాటికి కేరళను తాకుతాయని వాతావరణ విభాగం ఇంతకు ముందు అంచనా వేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ నెల 31 జూన్ మధ్య కాలంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ఫలితంగా రుతుపవనాలు ముందుగానే అంటే జూన్ 1 లేదా రెండో తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే ఉండాయని ఐఎండి ఇంతకు ముందు అంచనా వేసిన విషయం తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించనుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.

Southwest Monsoon to Kerala on June 1st

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జూన్1న కేరళకు నైరుతి రుతుపవనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: