చిరుత మృతి

  ఫారెస్ట్ అధికారులపై దాడి, ఇద్దరికి గాయాలు రెండు గంటల పాటు ముప్పతిప్పలు పెట్టిన వైనం బంధించి జూపార్క్ తరలిస్తుండగా దారిమధ్యలో మృతి మెదక్‌లోనూ ఓ చిరుత హల్‌చల్ మనతెలంగాణ/నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం రాజాపేట తాండాలోని ఓ పొలంలో పోలీసులను రెండు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టిన చిరుతను ఎట్టకేలకు బందించి హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఇనుప కంచెలో చిక్కుకొని ఫారెస్ట్ అధికారులకు చిక్కిన 7 సంవత్సరాల చిరుత మృతి […] The post చిరుత మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫారెస్ట్ అధికారులపై దాడి, ఇద్దరికి గాయాలు
రెండు గంటల పాటు ముప్పతిప్పలు పెట్టిన వైనం
బంధించి జూపార్క్ తరలిస్తుండగా దారిమధ్యలో మృతి
మెదక్‌లోనూ ఓ చిరుత హల్‌చల్

మనతెలంగాణ/నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం రాజాపేట తాండాలోని ఓ పొలంలో పోలీసులను రెండు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టిన చిరుతను ఎట్టకేలకు బందించి హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలిస్తుండగా మృతి చెందింది.

ఇనుప కంచెలో చిక్కుకొని ఫారెస్ట్ అధికారులకు చిక్కిన 7 సంవత్సరాల చిరుత మృతి చెందినట్లు నెహ్రూ జూపార్కు అధికారులు వివరించారు. చిరుతకు మత్తు ఇచ్చి జీప్ లో హైదరాబాద్ తరలిస్తుండగా చిరుత మృతి చెందిదని, కాగా ఇనుప కంచెలో ఇరుక్కుని, గాయాలు కావడం, రక్తం బాగా పోవడం, ఎండలు కారణంగా మృతి చెంది ఉంటుందని వైద్యుల నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని రైతు పొలంలో చిరుత కనిపించింది. పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెలో అది చిక్కుకుంది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించటంతో అధికారులు హుటాహుటిన తరలివచ్చారు.

రంగంలోకిదిగిన అధికారులు చిరుతపై వల వేసిన అధికారులు మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది వారిపై దాడి చేసి తప్పించుకుంది. వలలో చిక్కినట్టే చిక్కుకుని తప్పించుకుపోయిన చిరుత ఫారెస్టు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచింది. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే ఇనుప కంచెలో చిక్కుకోవడంతో చిరుతకు కూడా గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ తర్వాత కొద్దిసేపటికే అటవీ అధికారుల జీప్ కింద దూరిన చిరుత స్పృహ కోల్పోయింది. చిరుతను పట్టుకోవడానికి అధికారుల ఆపరేషన్ సఫలం కావడంతో చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు దానిని బంధించారు. అనంతరం ఆయనను హైదరాబాద్ జూ పార్కు కి తరలించారు. కాగా దారి మధ్యలోనే చిరుత మృతి చెందినట్లు జూపార్క్ అధికారులు వెల్లడించారు.

మెదక్‌లో చిరుత హల్‌చల్
మెదక్ జిల్లాలో ఓ గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితుల వివరాల మేరకు మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండల్ గ్రామ శివారులో చిరుతపులి స్థానికుల్ని హడలెత్తించింది. తొనిగండల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సూరన్న గారి భూపాల్‌కు గ్రామ శివారులో తన గొర్రెల మందకు కొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన జీవాలను కొట్టంలో ఉంచి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు.

బుధవారం తెల్లవారుజామున కొట్టంలోకి వెళ్లి చూడగా ఓ గొర్రె చనిపోయి ఉండగా మరో రెండు గొర్లు కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వెంటనే గ్రామస్తులకు తన గొడు వెల్లబోసుకున్నాడు. గ్రామ సర్పంచ్ విషయం చెప్పగా, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గత ఎనిమిది నెలలుగా రాని చిరుత మళ్లీ గ్రామ శివారుకు వచ్చి పశువులపై దాడులు చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leopard attacks forest staff in Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిరుత మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: