జలశైలోత్సవం

  యాగ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం నేడే నేడు రిజర్వాయర్ ప్రారంభం ఉదయం 11.35కు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ చండీయాగం, సుదర్శనయాగం, గంగపూజ సుదర్శనయాగం నిర్వహించనున్న త్రిదండి చినజీయర్ స్వామి కొండపోచమ్మ ఆలయంలో సిఎం దంపతుల ప్రత్యేకపూజలు ఉ.11.35కు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్, చండీ, సుదర్శన యాగాలు, గంగపూజతో మహారంభం సుదర్శన యాగం నిర్వహించనున్న త్రిదండి చినజీయర్‌స్వామి, కెసిఆర్ దంపతుల ప్రత్యేక పూజలు మనతెలంగాణ/హైదరాబాద్ […] The post జలశైలోత్సవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యాగ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు

కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం నేడే

నేడు రిజర్వాయర్ ప్రారంభం
ఉదయం 11.35కు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
చండీయాగం, సుదర్శనయాగం, గంగపూజ
సుదర్శనయాగం నిర్వహించనున్న త్రిదండి చినజీయర్ స్వామి
కొండపోచమ్మ ఆలయంలో సిఎం దంపతుల ప్రత్యేకపూజలు

ఉ.11.35కు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్, చండీ, సుదర్శన యాగాలు, గంగపూజతో మహారంభం
సుదర్శన యాగం నిర్వహించనున్న త్రిదండి చినజీయర్‌స్వామి, కెసిఆర్ దంపతుల ప్రత్యేక పూజలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరి జలాలను చేర్చేఅపూర్వఘట్టం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణకానుంది.

గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగుభూములను సస్యశ్యామలం చేస్తూ కొండపోచమ్మ కు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా చండీయాగం, మార్కుర్ పంపు హౌజ్ స్వీచ్ ఆన్‌చేసి కొండపోచమ్మ సాగర్‌కు గోదారమ్మను పంపిస్తారు. ఈ సందర్భంగా సుదర్శనయాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను సిఎం కెసిఆర్ నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘ ట్టానికి సర్వం సిద్ధమయ్యాయి. నేడు ఉదయం 11.35 నిమిషాలకు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఈ అపూర్వ ఘట్టం ప్రారంభం కానుంది. ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచి పోయింది.

కాళేశ్వరం పరిధిలో సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు మర్కుక్ పంపు హౌజ్ నుంచి గోదావరి జలాలు పరుగులు తీయనున్నాయి. ఈ ఆపూర్వఘట్టానికి రాష్ట్ర మంత్రులు కెటిఆర్, హరిష్ రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి హాజరు కానున్నారు. అలాగే మెదక్, యాదాద్రి జిల్లాలోని శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, జెడ్‌పి ఛైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. కొండపోచ మ్మ రిజర్వార్ ప్రారంభోత్సవం సందర్భంగా చరిత్రాత్మకమైన కొండపోచమ్మ ఆలయంలో ఉదయం 4.30 నిమిషాలకు చండీయాగం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాని కొండపోచమ్మ గ్రామ సర్పంచ్ రజితరామేష్, కొండపోచమ్మ దేవాలయం ఛైర్మన్ ఉపేందర్‌రెడ్డి చండీ యాగం నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి రాష్ట్ర ముఖ్యమం త్రి కెసిఆర్ సతీసమేతంగా చేరుకుని ఉదయం ఉదయం 7 గంటలకు కొండ పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.అనంతరం ఉదయం 9.40 గంటలకు మర్కూక్ లోని రైతు వేదికకు శంకు స్థాపన చేస్తారు. ఆతర్వాత సిఎం కెసిఆర్ ఉదయం 9.50 నిమిషాలకు మర్కుక్ పంప్ హౌజ్ చేరుకుంటారు. అనంతరం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యా డ్ చేరుకుని త్రిదండి చినజీయర్ స్వామిని ఆహ్వానిస్తారు. ఆతర్వాత చినజీయర్ స్వామితో కలిసి మర్కూక్ పంపు హౌజ్ దగ్గర సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమం లో సిఎం కెసిఆర్ దంపతులు పాల్గొంటారు.

ఆతర్వాత ఉదయం 11.35 నిమిషాలకు పంప్‌హౌజ్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. ఆనంతరం చినజీయర్ స్వామితో కలిసి కొండపోచమ్మ సాగర్ కట్టమీద డెలివరీ సిస్టమ్ దగ్గరకు చేరుకుని గోదావరి జలాలను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అతర్వాత 12గంటలకు కొండపోచమ్మ డెలివరీ సిస్టమ్ నుంచి బయలు దేరి వరదరాజు పూర్ గ్రామంలోని వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మర్కూక్ పంపు హౌజ్ దగ్గరకు చేరుకుని నీటిపారుదల ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ సమావేశం అవుతారు.

కొండపోచమ్మ ప్రత్యేకత
ఉమ్మడి మెదక్ జిల్లా, వరంగల్, నల్గొండ సరిహద్దుల్లో ఉ న్న కొండపోచమ్మ ఆలయానికి ప్రత్యేకత ఉంది. లక్షలాధి మంది భక్తులు ఈ ఆలయానికి ఉన్నారు. శుభకార్యాలయాలకు ముందు పోచమ్మను కలవడం తెలంగాణలో ఆ చారం. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ దంపతులు అనేకపర్యాయాలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తె లంగాణ ఉద్యమం సమయంలో కొండపోచమ్మకు మొక్కి ఆనంతరం సిఎంకెసిఆర్ మొక్కులు తీర్చారు. ఈ ఆలయానికి కొద్దిదూరంలోనే కొమురవల్లి మల్లన్న కొలువుతీరి ఉన్నారు. ఈ రెండు ఆలయాలను కాకతీయ రాజులు అభివృద్ధి చేసినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. ఎంతో సుప్రసిద్ధి చెందిన కొండపోచమ్మ ఆలయం పేరునే ఈ రిజర్వార్‌కు కెసిఆర్ నామకరణం చేశారు.

కొండపోచమ్మకు గోదావరి జలాలు ఇలా వస్తాయి
కాళేశ్వరం నుంచి 220 కిలోమీటర్లు పరుగులు తీసి రం గనాయక్ సాగర్ అన్నపూర్ణజలాశయం చేరుకుంటాయి. ఇక్కడి నుంచి తుక్కాపూర్(మల్లన్నసాగర్) సర్జీపూల్ పం ప్‌హౌజ్ ఎడమ కాల్వద్వారా 11.500 క్యూసెక్కుల నీరు తుక్కారం పంప్ హౌజ్ నుంచి 7.9 కిలో మీటర్ల దగ్గర ఉన్న కొడగండ్లకు చేరుకుంటాయి. అక్కడి నుంచి అక్కా రం చేరుకుంటాయి. ఇక్కడ 27 మెగావాట్ల మోటర్లు నీటి ఎత్తిపోస్తాయి. అనంతరం మార్కుక్ పంపుహౌజ్‌కు నీరు చేరుకుంటాయి. ఇక్కడ 34 మెగావాట్ల సామర్థంగల 6 మోటర్లు బిగించారు. ఒక్కోమోటరు 1250క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. ఇక్కడ నుంచి కిలోమీటరు దూరం లో ఉన్న కొండపోచమ్మరిజర్వాయర్‌కు నీటిని ఎత్తి పోస్తారు. మార్కుక్ నుంచి సుమారు అరకిలోమీటరు ఎత్తుకు నీటిని ఎత్తిపోసే ఆపూర్వఘట్టం ఆవిష్కరించబడుతుంది.

Kondapochamma reservoir begin today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జలశైలోత్సవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: