జియోలో మైక్రోసాఫ్ట్‌కు 2.5% వాటా!

  ఇప్పటికే పలు అమెరికా కంపెనీలు పెట్టుబడులు మొత్తం పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లు రిలయన్స్ జియోలో పెట్టుబడుల జాబితాలో మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని కోసం మైక్రోసాఫ్ట్ ఆర్‌ఐఎల్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. మైక్రోసాఫ్ట్ జియో ప్లాట్‌ఫామ్‌లో 2.5 శాతం వాటాను కొనుగోలు చేయాలనే కోరికను […] The post జియోలో మైక్రోసాఫ్ట్‌కు 2.5% వాటా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇప్పటికే పలు అమెరికా కంపెనీలు పెట్టుబడులు
మొత్తం పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లు

రిలయన్స్ జియోలో పెట్టుబడుల జాబితాలో మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

దీని కోసం మైక్రోసాఫ్ట్ ఆర్‌ఐఎల్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. మైక్రోసాఫ్ట్ జియో ప్లాట్‌ఫామ్‌లో 2.5 శాతం వాటాను కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేసింది. దీనికోసం 2 బిలియన్ డాలర్లు అంటే 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీనిపై అధికారిక వివరాలు వెల్లడికాలేదు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటివరకు 17.12శాతం వాటా కోసం రూ.78,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఫేస్‌బుక్ పెట్టుబడి రూ.43,574 కోట్లు, సిల్వర్ లేక్ రూ.5,656 కోట్లు, విస్టా ఈక్విటీ రూ.11,367 కోట్లు, జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు, కెకెఆర్ రూ.11,367 కోట్లు ఉన్నాయి.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల రిలయన్స్ జియోతో భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ భాగస్వామ్యంలో రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దీని కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ సేవలు ఉంటా యి. అయితే ఈ పెట్టుబడిపై మైక్రోసాఫ్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు స్పందించలేదు. ఆర్‌ఐఎల్ జియో ప్లాట్‌ఫాంలో పెట్టుబడి విషయంలో అమెరికన్ కంపెనీలు అత్యంత ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే ఈ దేశానికి చెందిన కంపెనీలే పెట్టుబడులు ప్రకటించాయి. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ అండ్ కో అన్నీ కూడా యుఎస్ కంపెనీలే. ఇప్పుడు అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే అనేక గ్లోబల్ ఇన్వెస్టర్లు జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గతంలోనూ చెప్పారు.

జియో ప్లాట్ ఫాం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ అనుబంధ సంస్థ. ఆర్‌ఐఎల్ గ్రూప్ డిజిటల్ బిజినెస్ ఆస్తులైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, జియో యాప్స్, హాప్టిక్, రివైర్, ఫైండ్, నౌఫ్లోట్స్, హాత్వే వంటి వివిధ సంస్థలలో పెట్టుబడులను కూడా సంస్థ నిర్వహిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత ఆగస్టులో ఆర్‌ఐఎల్‌ను 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. సౌదీ అరాంకోతో సహా మరెన్నో కంపెనీలకు వాటాల అమ్మకం ద్వారా ఈ ఏడా ది డిసెంబర్ నాటికి రుణం తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తున్నారు. మార్చి త్రైమాసికం ముగిసే సమయానికి రిలయన్స్ రూ.3,36,294 కోట్లు అప్పులను కల్గివుంది. అదే సమయంలో కంపెనీకి 1,75,259 కోట్ల రూపాయల నగదు ఉంది. అప్పును నగదుతో సర్దుబాటు చేసిన తర్వాత కంపెనీ నికర రుణం రూ.1,61,035 కోట్లుగా ఉంది.

Microsoft in talks to buy 2.5% stake in Jio

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జియోలో మైక్రోసాఫ్ట్‌కు 2.5% వాటా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: