టెలికాం రంగంలో మారుతున్న సమీకరణాలు

  న్యూఢిల్లీ: టెలికాం రంగంలో కొత్త సమీకరణాలతో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ జియో పెట్టుబడుల కోసం తలుపులు బార్లా తెరిచింది. జియోను మరింత వృద్ధి చేసేందుకు ఈ పెట్టుబడులను స్వీకరిస్తోంది. అదే సమయం లో రుణ రహిత సంస్థే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇక మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న వొడాఫోన్ ఐడియా కూడా మెల్లగా ముందు సాగేందుకు […] The post టెలికాం రంగంలో మారుతున్న సమీకరణాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో కొత్త సమీకరణాలతో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ జియో పెట్టుబడుల కోసం తలుపులు బార్లా తెరిచింది. జియోను మరింత వృద్ధి చేసేందుకు ఈ పెట్టుబడులను స్వీకరిస్తోంది. అదే సమయం లో రుణ రహిత సంస్థే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇక మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న వొడాఫోన్ ఐడియా కూడా మెల్లగా ముందు సాగేందుకు అడుగులు వేస్తోంది.

దీనిలో భాగంగానే పెట్టుబడుల కోసం ప్రయత్నాలు మొద లుపెట్టింది. టెక్ దిగ్గజం గూగుల్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు మరో దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ వాటాలను 2.75 శాతం విక్రయించి, 1 బిలియన్ డాలర్లు సమీకరించింది.

వొడాఫోన్ ఐడియాపై గూగుల్ కన్ను
దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాలో 5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ప్రయత్నిస్తోంది. ఈమేరకు టెలికాం కంపెనీ గూగుల్‌తో చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులకు గూగుల్ ఆసక్తి చూపుతోంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ మార్కెట్ కల్గిన భారత్‌లో ఫేస్‌బుక్‌కు ధీటుగా గూగుల్ కూడా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో వొడాఫోన్ ఐడియా ప్రత్యర్థి సంస్థ జియోలో ఫేస్‌బుక్ 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. రూ.53 వేల కోట్ల ఎజిఆర్(సర్దుబాటు స్థూల ఆదాయం) బకాయిలను ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడిఆ చెల్లించాల్సి ఉంది. దీనిలో కొంత మొత్తం ఈ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించింది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టెలికాం రంగంలో మారుతున్న సమీకరణాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: