బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి : నాగబాబు

  టాలీవుడ్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి తలసానితో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్‌కు బాలకృష్ణను పిలవకపోవడం పొరపాటేనని నిర్మాతల మండలి సభ్యులు అంటున్నారు. అయితే ఇండస్ట్రీ మొత్తం కలిసొస్తే.. మాట్లాడటానికి సిద్ధమేనని మంత్రి తలసాని తెలిపారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు. భూములు పంచుకోవడానికి కలిశారనడం బాధాకరమన్నారు. బాలకృష్ణ ఆ […] The post బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి : నాగబాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాలీవుడ్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి తలసానితో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్‌కు బాలకృష్ణను పిలవకపోవడం పొరపాటేనని నిర్మాతల మండలి సభ్యులు అంటున్నారు.

అయితే ఇండస్ట్రీ మొత్తం కలిసొస్తే.. మాట్లాడటానికి సిద్ధమేనని మంత్రి తలసాని తెలిపారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు. భూములు పంచుకోవడానికి కలిశారనడం బాధాకరమన్నారు.

బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. అంతకంటే పది రెట్లు ఎక్కువ తాము మాట్లాడగలమన్నారు. “ఇండస్ట్రీకి మీరే కింగ్ కాదు.. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. టాలీవుడ్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి” అని నాగబాబు డిమాండ్ చేశారు.

Naga Babu talking about Balakrishna comments

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి : నాగబాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: