ఆధార్‌తో తక్షణమే ఇ-పాన్

  ప్రారంభించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : ఆధార్ వివరాలను అందివ్వడం ద్వారా తక్షణమే ఆన్‌లైన్ పాన్(శాశ్వత ఖాతా సంఖ్య) కేటాయించే సౌకర్యాన్ని గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. బడ్జెట్ 2020-21లో చేసిన ప్రతిపాదన మేరకు తక్షణమే ఇపాన్‌ను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి దరఖాస్తు ఫారమ్‌ను నింపకుండానే ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఇ-పాన్‌ను అందుకోవచ్చు. తక్షణమే పాన్ కేటాయింపు సౌకర్యాన్ని గురువారం మంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా […] The post ఆధార్‌తో తక్షణమే ఇ-పాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రారంభించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : ఆధార్ వివరాలను అందివ్వడం ద్వారా తక్షణమే ఆన్‌లైన్ పాన్(శాశ్వత ఖాతా సంఖ్య) కేటాయించే సౌకర్యాన్ని గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.

బడ్జెట్ 2020-21లో చేసిన ప్రతిపాదన మేరకు తక్షణమే ఇపాన్‌ను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి దరఖాస్తు ఫారమ్‌ను నింపకుండానే ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఇ-పాన్‌ను అందుకోవచ్చు. తక్షణమే పాన్ కేటాయింపు సౌకర్యాన్ని గురువారం మంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా ప్రారంభించారని సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ప్రకటించింది.

ఎవరైతే విలువైన ఆధార్ నంబర్, ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకుంటారో వారికి తక్షణ ఇపాన్ అందుబాటులో ఉంటుంది. దీనికి ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, ఉచితంగా ఇపాన్ అందివ్వనున్నట్టు సిబిడిటి తెలిపింది. ఇ-పాన్ కోసం ఆధార్ సంఖ్యను అందించాలి. దీని తరువాత కెవైసి ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తరువాత దరఖాస్తుదారుడికి కేవలం 10 నిమిషాల్లో పిడిఎఫ్ రూపంలో పాన్ జారీ చేస్తారు.

ఇ-పాన్ పొందడం ఎలా?
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు incometaxindiaefiling.gov.in కు వెళ్లాలి.
ఇక్కడ ఆధార్ విభాగం ద్వారా ఇన్‌స్టంట్ పాన్‌పై క్లిక్ చేయాలి
కొత్త పేజీ వస్తుంది. ఇక్కడ మీరు ‘గెట్ న్యూ పాన్’ పై క్లిక్ చేయాలి.
మరో కొత్త పేజీ వస్తుంది. దానిలో ఆధార్ వివరాలను నింపాలి.
కాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
ఆ తరువాత ఒటిపి వస్తుంది. ఒటిపిని నమోదు చేయాలి.
ఆధార్ వివరాలను ధృవీకరించాలి.
పాన్ కార్డు కోసం ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి. ఆధార్ ఇ-కెవైసి డేటా ఇ-పాన్‌కు బదిలీ అవుతుంది.
ఈ మొత్తం ప్రక్రియకు 10 నిమిషాలు పడుతుంది.
ఆ తర్వాత ఇ-పాన్ పిడిఎఫ్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

Free instant e-PAN facility through Aadhaar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆధార్‌తో తక్షణమే ఇ-పాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: