పూజాహెగ్డేపై హ్యాకర్ల పంజా

  కరోనా మహమ్మారీ వేళ రకరకాల పరిణామాలు సినీ స్టార్లను ఊపిరాడనివ్వడం లేదు. అందులో హ్యాకింగ్ ఒకటి. నిత్యం హ్యాకర్లు సినీ సెలబ్రిటీలపై పంజా విసురుతూనే ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్, శోభన, కరీనా కపూర్, ఊర్వశి రౌతేలా.. ఒకరేమిటి ఎందరినో హ్యాకర్లు వేధించారు. వీరి సోషల్ మీడియా అక్కౌంట్లను హ్యాక్ చేసి నానా రచ్చ చేశారు. ఇప్పుడు హ్యాకింగ్ మరింత పెచ్చు మీరింది. టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డేకి తాజాగా ఈ పరిస్థితి ఎదురైంది. […] The post పూజాహెగ్డేపై హ్యాకర్ల పంజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా మహమ్మారీ వేళ రకరకాల పరిణామాలు సినీ స్టార్లను ఊపిరాడనివ్వడం లేదు. అందులో హ్యాకింగ్ ఒకటి. నిత్యం హ్యాకర్లు సినీ సెలబ్రిటీలపై పంజా విసురుతూనే ఉన్నారు.

గతంలో పవన్ కళ్యాణ్, శోభన, కరీనా కపూర్, ఊర్వశి రౌతేలా.. ఒకరేమిటి ఎందరినో హ్యాకర్లు వేధించారు. వీరి సోషల్ మీడియా అక్కౌంట్లను హ్యాక్ చేసి నానా రచ్చ చేశారు. ఇప్పుడు హ్యాకింగ్ మరింత పెచ్చు మీరింది. టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డేకి తాజాగా ఈ పరిస్థితి ఎదురైంది. పూజా చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేడెక్కించే ఫోటోషూట్లు, వీడియో షూట్లను ఎలాంటి దాపరికం లేకుండా పోస్ట్ చేస్తూ.. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్దులను చేసింది.

కానీ ఇంతలోనే అకస్మాత్తుగా బుధవారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని పూజాహెగ్డే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయమై తన డిజిటల్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపింది. ఆమె డిజిటల్ టీమ్ ప్రస్తుతం ఆ ఖాతాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక పూజాహెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సహా పలువురు అగ్ర కథానాయకుల సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పూజాహెగ్డేపై హ్యాకర్ల పంజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: