అందమైన ఫోటోలతో వల.. మ్యాట్రిమోనిలో ఎన్‌ఆర్‌ఐని మోసం చేసిన మహిళ

మనతెలంగాణ/హైదరాబాద్: నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎన్నారైని వివాహం చేసుకుంటానని మోసం చేసిన మహిళ, ఆమె కుమారుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మాళవిక అనే మహిళ ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి మ్యాట్రిమోనిలో షేర్ చేసి పలువురు ఎన్‌ఆర్‌ఐలను మోసం చేస్తోంది. దీనికి మాళవికకు ఆమె కుమారుడు ప్రణవ్ సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో కాలిఫోర్నియాకు చెందిన వరుణ్ అనే ఎన్‌ఆర్‌ఐకి వల వేసి వివాహం చేసుకుంటానని చెప్పి దశలవారీగా రూ.65లక్షలు వసూలు […] The post అందమైన ఫోటోలతో వల.. మ్యాట్రిమోనిలో ఎన్‌ఆర్‌ఐని మోసం చేసిన మహిళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎన్నారైని వివాహం చేసుకుంటానని మోసం చేసిన మహిళ, ఆమె కుమారుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మాళవిక అనే మహిళ ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి మ్యాట్రిమోనిలో షేర్ చేసి పలువురు ఎన్‌ఆర్‌ఐలను మోసం చేస్తోంది. దీనికి మాళవికకు ఆమె కుమారుడు ప్రణవ్ సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో కాలిఫోర్నియాకు చెందిన వరుణ్ అనే ఎన్‌ఆర్‌ఐకి వల వేసి వివాహం చేసుకుంటానని చెప్పి దశలవారీగా రూ.65లక్షలు వసూలు చేసింది. తాను డాక్టర్‌నని తనకు చాలా ఆస్థులు ఉన్నాయని అతడికి మాయమాటలు చెప్పింది. ఆస్తులు తన పేరుమీద రాయాలని తల్లి వేధిస్తోందని తెలిపింది.

ఆస్థులు కాపాడుకునేందుకు లీగల్‌గా పోరాడేందుకు తనకు డబ్బులు కావాలని చెప్పడంతో బాధితుడు నిజమేనని నమ్మి డబ్బులు పంపించాడు. అనంతరం వివాహం గురించి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని, ఆమె కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. గతంలోనూ మాళవిక తన భర్త, అత్తా సాయంతో ఇదే విధంగా ఓ ఎన్‌ఆర్‌ఐని మోసం చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Woman cheats NRI with Marriage Promise in Hyderabad

The post అందమైన ఫోటోలతో వల.. మ్యాట్రిమోనిలో ఎన్‌ఆర్‌ఐని మోసం చేసిన మహిళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: