కవ్వింపుల కయ్యాలు.. రేఖ వెంబడి హై టెన్షన్

  న్యూఢిల్లీ: పరస్పర హెచ్చరికలు తప్ప, పట్టువిడుపులు లేకపోవడంతో భారత్ ‌చైనా జగడం యధాతథం అయింది. క్షేత్రస్థాయిలో ఇరుపక్షాల వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో రాజకున్న పరిస్థితి భగ్గుమనేలా మారింది. భారత్ చైనాల మధ్య కయ్యాలకు దారితీసిన నాలుగు చోట్ల కూడా సైనికుల మొహరింపు పోటాపోటీగానే సాగుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉండే లడక్ సెక్టార్‌లోని గల్వాన్ వ్యాలీ, ప్యాంగాంగ్ సో ప్రాంతాలు క్షేత్రస్థాయిలో ఇరు దేశాల సైనికుల మధ్య కవ్వింపులు, తదుపరి కయ్యాలకు దారితీస్తున్నాయి. ఎల్‌ఎసి […] The post కవ్వింపుల కయ్యాలు.. రేఖ వెంబడి హై టెన్షన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: పరస్పర హెచ్చరికలు తప్ప, పట్టువిడుపులు లేకపోవడంతో భారత్ ‌చైనా జగడం యధాతథం అయింది. క్షేత్రస్థాయిలో ఇరుపక్షాల వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో రాజకున్న పరిస్థితి భగ్గుమనేలా మారింది.

భారత్ చైనాల మధ్య కయ్యాలకు దారితీసిన నాలుగు చోట్ల కూడా సైనికుల మొహరింపు పోటాపోటీగానే సాగుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉండే లడక్ సెక్టార్‌లోని గల్వాన్ వ్యాలీ, ప్యాంగాంగ్ సో ప్రాంతాలు క్షేత్రస్థాయిలో ఇరు దేశాల సైనికుల మధ్య కవ్వింపులు, తదుపరి కయ్యాలకు దారితీస్తున్నాయి. ఎల్‌ఎసి వెంబడి ఉండే సరస్సు ప్యాంగాంగ్ సో, డెమ్‌ఛోక్, గల్వాన్ వ్యాలీలతో పాటు సిక్కింలోని నకూ లా ప్రాంతాలు తరచూ ఇరు పక్షాల సైనికుల పరస్పర కవ్వింపులకు కేంద్ర బిందువులు అవుతున్నాయి.

ఈ నాలుగు ప్రాంతా వద్ద ఆధిపత్యాలను చాటుకోవడానికి అంటు పిఎల్‌ఎ సేనలు, ఇటు భారతీయ నైపుణ్య బలగాలు రంగంలోకి దిగాయి, గస్తీని ఉధృతం చేశాయి. ఇరు పక్షాలూ మరో అడుగు ముందుకు వేసి టెంట్లు వేసుకోవడం, కందకాలు తవ్వుకుని ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి నెలకొంది. కరోనాతో అంతర్జాతీయ హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నెలకొన్న దశలోనే రెండు దేశాల మధ్య ఘర్షణాయుత వాతావరణం ప్రపచం దృష్టిని ఆకర్షించింది. ట్రంప్ ఓ వైపు మధ్యవర్తిత్వం వహిస్తాననే ఆచరణసాధ్య అతీత ప్రతిపాదన చేసిన దశలో ఇరు పక్షాల ధృఢవైఖరితో ఇంతకు ముందటి పరిస్థితి ఎప్పుడు నెలకొంటుందనేది చెప్పలేకపోతున్నారు.

సమస్య లేదంటున్న చైనా విదేశాంగ శాఖ
వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తత ఉన్న దశలోనే చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పరిస్థితి అంతా బాగానే ఉందని తెలిపింది. ఎటువంటి సమస్య లేదని , అంతా సర్దుకుంటుందని పేర్కొంది. ఇరు పక్షాలూ ఎప్పటికప్పుడు సంప్రదింపులలో ఉన్నాయని, అంతా అదుపులో ఉన్న సమయంలో దీనిపై ఇతరత్రా చర్చకు అవకాశం లేదని చైనా విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పలు రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న దశలో చైనా ఈ కోణంలో తలనొప్పిని తెచ్చుకునేందుకు సిద్ధంగా లేదని ఈ ప్రకటనతో వెల్లడైంది. అయితే క్షేత్రస్థాయిలో ఎల్‌ఎసి వెంబడి పరిస్థితి మరో విధంగా ఉంది. భారతదేశ ఇరుగుపొరుగు దేశాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చిన దశలోనే చైనా వ్యూహాత్మకంగానే ఇప్పుడు వాస్తవాధీన రేఖ వెంబడి వ్యూహాత్మకంగానే తన పట్టుబిగించేందుకు అడుగు ముందుకు వేసిందని భారత విదేశాంగ శాఖ విశ్వసిస్తోంది.

4 బుల్లెట్ పాయింట్లు
వాస్తవాధీన రేఖ వెంబడి నాలుగు వివాదాస్పద ప్రాంతాలే ఇప్పుడు ఇరుపక్షాల ఘర్షణకు కేంద్ర బిందువులు అయ్యాయి. ఇటీవలి కాలంలో ఈ నాలుగు ప్రాంతాలలో భారతదేశం కూడా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టింది. దీనిని నివారించేందుకు చైనా బలగాలు ఇక్కడికి వ్యూహాత్మకంగానే దిగాయని వెల్లడైంది. గల్వాన్ నల్లా వెంబడి ఓ బ్రిడ్జి నిర్మాణం, ప్యాంగాంగ్ లేక్ వద్ద పర్యవేక్షక కేంద్రం ఏర్పాటు వంటి వాటిని ఇండియా తన రక్షణ వ్యూహంలో భాగంగా చేపట్టింది. దీనిని తనకు సవాలుగా భావించిన చైనా ఇందుకు ప్రతిగా పిఎల్‌ఎ బలగాలను రంగంలోకి దింపింది.

సరిహద్దులలో పనిగట్టుకుని భారతదేశం తన పాటవాన్ని పెంచుకొంటోందని, ఈ దశలో ఈ పక్షం నుంచే కవ్వింపు చర్యలు ముమ్మరం అయ్యాయని చైనా ఆరోపిస్తోంది. గల్వాన్ బ్రిడ్జి చిన్నదే అయినప్పటికీ తరువాతి దశలో సరిహద్దుల వెంబడి దౌలత్ బెగ్ ఓల్డీకు చేరుకునే అత్యంత కీలకమైన 225 కిలోమీటర్ల రాదారి నిర్మాణంలో ఈ బ్రిడ్జి కీలకం అవుతుంది. కరకోరమ్ కనుమలకు దక్షిణాన ఉండే చిట్టచివరి సైనిక స్థావరం ఇదే. అంతకు ముందు చైనా ఈ ప్రాంతంలో విస్తృతస్థాయిలో నిర్మాణ పనులు ముగించుకుని ఉంది. రాదార్లను వేసుకుంది.

అత్యంత సునిశితమైన రీతిలో భద్రతా చర్యలను పటిష్టం చేసుకుంది. దీనికి ప్రతిగా ఇండియా ఇప్పుడు ప్రతి చర్యలకు దిగడంతో చైనా దీనిని మరో విధంగా భావించడం దారుణమని భారత అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేకించి సరిహద్దులకు ఈవల రహదారులు, బ్రిడ్జిలు, వైమానిక స్థావరాలు కట్టుకుంటే, ఏర్పాటు చేసుకుంటే తప్పేముందని ఓ అధికారి ప్రశ్నించారు. వివాదాస్పద ప్రాంతాల్లో నిర్మాణాలకు, ఇతరత్రా కవ్వింపు చర్యలకు తాము దిగడం లేదని , ఇండియా వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుందని ఈ అధికారి తెలిపారు.

అక్సాయ్ చిన్‌లో చైనా సైనిక జోరు
వివాదాస్పద అక్సాయ్ చిన్‌లో చైనా ఇప్పుడు తన ద్విముఖ సైనిక వినియోగ పాటవాన్ని పెంచుకుంది. ఎల్‌ఎసికి 60 కిలోమీటర్ల దూరంలోని ఎన్‌గరి గున్సా ఎయిర్‌పోర్టు సైనిక, పౌర అవసరాలకు అనుగుణంగా ఉంది. దీనిని మరింత పటిష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు పిఎల్‌ఎ సైనిక బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి.అత్యంత అధునాతనమైన జె 11 జెట్ విమానాలు ఇక్కడ చక్కర్లు కొడుతున్నాయి.

రష్యా సుఖోయి ఫైటర్లకు దీటుగా చైనా ఈ విమానాలను రూపొందించుకుంది. ఈ ప్రాంతంలోని ఇతర వైమానిక క్షేత్రాలలో యార్కాండ్ కూడా ఉంది. ఎల్‌ఎసికి ఇది 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. కష్‌గార్, కొర్లా వైమానిక స్థావరాలు కూడా ఇప్పుడు అన్ని విధాలుగా సైనిక పాటవంతో సిద్ధంగా ఉన్నాయి. అయితే బలగాల సమీకరణను ఘర్షణకు సంకేతంగా భావించాల్సిన పనిలేదని చైనా విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు.

We are engaged with China to resolve border row

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కవ్వింపుల కయ్యాలు.. రేఖ వెంబడి హై టెన్షన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: