గొండియాకు మిడతల దండొచ్చింది

  నాగ్‌పూర్: పలు దేశాలను దాటుకుంటూ వచ్చిన మిడతల దండు ఇప్పుడు మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు చేరుకుంది. పొరుగున ఉన్న భండారా జిల్లాలో పంటలను నాశనం చేసిన ఈ మిడతల దండు ముందుకు కదిలింది. గొండియా జిల్లాలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు గురువారం హెచ్చరించారు. పంటలపై క్రిమిసంహారక మందులు పెద్ద ఎత్తున చల్లారు. భండారా జిల్లాలోని తెమాని గ్రామంలో చెట్లను కూడా వదలకుండా మిడతల దండ్లు పట్టుకున్నాయి. ఈ గ్రామానికి వ్యవసాయ అధికారుల బృందం తరలివచ్చింది. […] The post గొండియాకు మిడతల దండొచ్చింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగ్‌పూర్: పలు దేశాలను దాటుకుంటూ వచ్చిన మిడతల దండు ఇప్పుడు మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు చేరుకుంది. పొరుగున ఉన్న భండారా జిల్లాలో పంటలను నాశనం చేసిన ఈ మిడతల దండు ముందుకు కదిలింది. గొండియా జిల్లాలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు గురువారం హెచ్చరించారు.

పంటలపై క్రిమిసంహారక మందులు పెద్ద ఎత్తున చల్లారు. భండారా జిల్లాలోని తెమాని గ్రామంలో చెట్లను కూడా వదలకుండా మిడతల దండ్లు పట్టుకున్నాయి. ఈ గ్రామానికి వ్యవసాయ అధికారుల బృందం తరలివచ్చింది. మామిడి, టేక్, రాగి ఇతర చెట్లపై మిడతలు విస్తారరీతిలో పర్చుకుని ఉన్నాయి. కిలోమీటర్ల పరిధిలో మిడతల నివారణకు మందులు స్ప్రే చేసినట్లు అధికారులు తెలిపారు.

Locust Swarms reached Gondia district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గొండియాకు మిడతల దండొచ్చింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: