రోహిత్‌ను ఔట్ చేయడమే ఇష్టం

  కరాచీ: ప్రపంచ క్రికెట్‌లో తాను తాను ఔట్ చేసేందుకు ఇష్టపడే బ్యాట్స్‌మన్‌లలో రోహిత్ శర్మదే అగ్రస్థానమని, అతని వికెట్‌ను తీయడమంటే తనకు చాలా ఇష్టమని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. సమకాలిన క్రికెట్‌లో రోహిత్ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ అని, అతని వికెట్ తీస్తే లభించే ఆనందం వేరుగా ఉంటుందన్నాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్‌లలోనూ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదన్నాడు. అయితే అతని వికెట్‌ను తీయడం […] The post రోహిత్‌ను ఔట్ చేయడమే ఇష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరాచీ: ప్రపంచ క్రికెట్‌లో తాను తాను ఔట్ చేసేందుకు ఇష్టపడే బ్యాట్స్‌మన్‌లలో రోహిత్ శర్మదే అగ్రస్థానమని, అతని వికెట్‌ను తీయడమంటే తనకు చాలా ఇష్టమని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. సమకాలిన క్రికెట్‌లో రోహిత్ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ అని, అతని వికెట్ తీస్తే లభించే ఆనందం వేరుగా ఉంటుందన్నాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్‌లలోనూ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదన్నాడు. అయితే అతని వికెట్‌ను తీయడం కంటే తనకు రోహిత్‌ను వెనక్కి పంపిస్తేనే అధిక ఆనందం కలుగుతుందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ను మించిన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరన్నాడు. ధాటిగా ఆడడంలో, భారీ స్కోర్లను సాధించడంలో రోహిత్ చాలా ప్రత్యేకత కలిగిన బ్యాట్స్‌మన్ అని ప్రశంసించాడు. ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమిర్ ఈ విషయం చెప్పాడు. ఇక, కరోనా వల్ల ఎక్కడికక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిలిచి పోవడం బాధగా ఉందన్నాడు. త్వరలోనే పరిస్థితి మాములుగా మారుతాయనే నమ్మకం తనకుందన్నాడు. ఇక, భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని కోరుకుంటున్నానని ఆమిర్ పేర్కొన్నాడు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోహిత్‌ను ఔట్ చేయడమే ఇష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: