ప్రాక్టీస్‌లోనే ఉన్నా 

  బెల్‌గ్రేడ్: లాక్‌డౌన్ సమయంలో తాను నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ అన్నాడు. సోదరుడిని కలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన జకోవిచ్ రెండు నెలల పాటు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. కరోనా వల్ల స్పెయిన్ అల్లకల్లోలంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎన్నో కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉండడంతో జకోవిచ్ కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్‌లోనే ఉండి పోక తప్పలేదు. […] The post ప్రాక్టీస్‌లోనే ఉన్నా  appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెల్‌గ్రేడ్: లాక్‌డౌన్ సమయంలో తాను నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ అన్నాడు. సోదరుడిని కలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన జకోవిచ్ రెండు నెలల పాటు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. కరోనా వల్ల స్పెయిన్ అల్లకల్లోలంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎన్నో కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉండడంతో జకోవిచ్ కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్‌లోనే ఉండి పోక తప్పలేదు. కాగా, రెండు రోజుల క్రితమే జకోవిచ్ సెర్బియా చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో ముచ్చటించాడు. కరోనా వల్ల ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోవడం చాలా బాధ కలిగించిందన్నాడు. అంతేగాక ఈ మహమ్మరి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణించడం ఆవేదనకు గురి చేసిందన్నాడు. స్పెయిన్‌లో కరోనా సృష్టించిన కల్లోలం చూసి తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆందోళనకు గురయ్యారన్నాడు.

తామంత రిసార్ట్‌కే పరిమితమయ్యామన్నాడు. ఇక, రిసార్ట్‌లో ఇండోర్ టెన్నిస్ కోర్టు ఉండడం తనకు కలిసి వచ్చిందన్నాడు. అక్కడే క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేశానన్నాడు. అంతేగాక నిరంతం ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ప్రయత్నించానన్నాడు. కాగా, కరోనా పూర్తిగా తగ్గితే టెన్నిస్‌తో సహా అన్ని క్రీడలకు పూర్వవైభవం రావడం ఖాయమన్నాడు. జీవితంలో ఇంతటి క్లిష్ట పరిస్థితిని చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నాడు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించి పోవడం షాక్‌కు గురి చేసిందన్నాడు. కంటికి కనిపించని ఓ మహమ్మరి మొత్తం ప్రపంచాన్ని వణికించడం ఆశ్చర్యం కలిగించే అంశమన్నాడు. మానవుడు వైద్య పరంగా ఎంతో పరిణితి సాధించినా కరోనాతో సహా చాలా వైరస్‌లకు మందులు కనిపెట్టడంలో నామమాత్రంగానే మిగిలి పోయాడన్నాడు. ఈ వ్యాధి నుంచి ప్రపంచం బయట పడాలంటే దేవుడ్ని ప్రార్టించడం తప్ప మరో మార్గం లేదన్నాడు.

త్వరలోనే ఆడ్రియా టోర్నీ

మరోవైపు వచ్చె నెలలో తన ఫౌండేషన్ ద్వారా ఆడ్రియా టూర్ టెన్నిస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు జకోవిచ్ వివరించాడు. జూన్ 15 నుంచి జులై ఐదు వరకు ఈ టోర్నీ జరుగుతుందన్నాడు. దీన్ని బాల్కన్స్ వేదికగా ఉంటుందన్నాడు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ టోర్నీ నిర్వహిస్తానన్నాడు. ఇక తనతో పాటు అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా), గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)లు పాల్గొంటారని తెలిపాడు. ఇక అగ్రశ్రేణి ఆటగాళ్లు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్)లు ఈ టోర్నీకి దూరంగా ఉంటారన్నాడు. ఫెదరర్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని, నాదల్ మాత్రం దీనికి హాజరవుతాడని తాను భావించడం లేదన్నాడు. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత ఓ అంతర్జాతీయ టోర్నీ నిర్వహిస్తుండడం, దీనిలో తనతో పాటు అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనడం ఆనందం కలిగిస్తుందన్నాడు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రాక్టీస్‌లోనే ఉన్నా  appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: