పొట్టి క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ రోహిత్‌దే..

టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో తొలి డబుల్ సెంచరీని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పేరుపై లిఖించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేర్కొన్నాడు. తొలి టీ20 డబుల్ సెంచరీని ఎవరు సాధిస్తారని ఇఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్‌ఫో ఓ వీడియో ద్వారా డ్వేన్ బ్రావోను అడిగింది. దీనికి సమాధానంగా.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మనే తొలి టీ20 డబుల్ సెంచరీని సాధిస్తాడని బ్రావో తెలిపాడు. ఇప్పటికే రోహిత్ వన్డేలలో […] The post పొట్టి క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ రోహిత్‌దే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో తొలి డబుల్ సెంచరీని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పేరుపై లిఖించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేర్కొన్నాడు. తొలి టీ20 డబుల్ సెంచరీని ఎవరు సాధిస్తారని ఇఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్‌ఫో ఓ వీడియో ద్వారా డ్వేన్ బ్రావోను అడిగింది. దీనికి సమాధానంగా.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మనే తొలి టీ20 డబుల్ సెంచరీని సాధిస్తాడని బ్రావో తెలిపాడు.

ఇప్పటికే రోహిత్ వన్డేలలో ఎవరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. దీంతో వన్డేలో అత్యధిక స్కోరు 264 నమోదు చేసిన క్రికెటర్‌గానూ రోహిత్ రికార్డు నెలకోల్పాడు. ఇక, పొట్టి ఫార్మాట్లోనూ రోహిత్ నాలుగు సెంచరీలు బాదాడు. ఈ ఫార్మాట్‌లోనూ అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు రోహిత్(4)దే. టీ20లో రోహిత్ అత్యధిక స్కోరు 118. కాగా, టీ20లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ సాధించిన 175 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(172) రెండో స్థానంలో ఉన్నాడు.

Rohit Sharma Will hit 1st Double Century in T20 Cricket: Bravo

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పొట్టి క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ రోహిత్‌దే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: