హెచ్‌డిఎఫ్‌సి లాభం 22 శాతం తగ్గింది

  క్యూ4లో నికర లాభం రూ.2,233 కోట్లు షేరుకు రూ.21 చొప్పున డివిడెండ్ ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ : గృహ రుణ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి (హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్) క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. మార్చి ముగింపు నాటి క్యూ4లో సంస్థ నికర లాభం 22 శాతం తగ్గి రూ.2,232 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ నికర లాభం రూ.2,862 కోట్లుగా ఉంది. క్యూ4లో(జనవరిమార్చి) సంస్థ ఆదాయం రూ.11,975.72 కోట్లు నమోదైంది. గతేడాది […] The post హెచ్‌డిఎఫ్‌సి లాభం 22 శాతం తగ్గింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్యూ4లో నికర లాభం రూ.2,233 కోట్లు
షేరుకు రూ.21 చొప్పున డివిడెండ్ ప్రకటించిన బోర్డు

న్యూఢిల్లీ : గృహ రుణ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి (హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్) క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. మార్చి ముగింపు నాటి క్యూ4లో సంస్థ నికర లాభం 22 శాతం తగ్గి రూ.2,232 కోట్లు నమోదు చేసింది.

గతేడాది ఇదే సమయంలో సంస్థ నికర లాభం రూ.2,862 కోట్లుగా ఉంది. క్యూ4లో(జనవరిమార్చి) సంస్థ ఆదాయం రూ.11,975.72 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.11,580 కోట్లుగా ఉంది. ఒక షేరుపై రూ .21 డివిడెండ్‌ను హెచ్‌డిఎఫ్‌సి బోర్డు ఆమోదించింది. డివిడెండ్ల నుండి ఈ త్రైమాసికంలో ఆదాయం కేవలం రూ.2 కోట్లు మాత్రమే, గత సంవత్సరం ఇది రూ.537 కోట్ల రూపాయలు. అలాగే, ఇన్వెస్ట్‌మెంట్ సేల్‌లో భారీ క్షీణత నమోదైంది.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ మార్జిన్ 1.1 శాతం పెరిగి 3.4 శాతానికి చేరుకుంది. మార్చి మధ్య నుండి కరోనా వైరస్‌తో వ్యాపారం మందగించగా, నిరర్ధక రుణాలు పెరిగాయి. హెచ్‌డిఎఫ్‌సి స్థూల నిరర్థక రుణాలు రూ .8.908 కోట్లు, ఇది మొత్తం రుణ పోర్ట్‌ఫోలియోలో 1.99 శాతం. అయితే ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ .3,564 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ. చైనా సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పిబిఒసి) మార్చి త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌లో ఒక శాతానికి పైగా వాటాను సొంతం చేసుకుంది. దీనికోసం పిబిఒసి హెచ్‌డిఎఫ్‌సిలో 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ మార్పిడి జనవరిమార్చి మధ్య జరిగిందని భావిస్తున్నారు.

Profit may fall up to 22% in HDFC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హెచ్‌డిఎఫ్‌సి లాభం 22 శాతం తగ్గింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: