భారతీ ఎయిర్‌టెల్‌లో 2.75 శాతం వాటా విక్రయం

  1 బిలియన్ డాలర్లు సమీకరించే యోచనలో భారతీ టెలికాం న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో వాటాలను విక్రయించడం ద్వారా 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని మాతృ సంస్థ భారతీ టెలికామ్ నిర్ణయించింది. యూనిట్‌కు రూ.558 చొప్పున దాదాపు 2.75 శాతం వాటాలను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించాలని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం బ్లాక్ డీల్ ద్వారా ఈ వాటాల సేల్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే గతవారం ఎయిర్‌టెల్ షేర్లు 0.2 శాతం తగ్గింపుతో […] The post భారతీ ఎయిర్‌టెల్‌లో 2.75 శాతం వాటా విక్రయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

1 బిలియన్ డాలర్లు సమీకరించే యోచనలో భారతీ టెలికాం

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో వాటాలను విక్రయించడం ద్వారా 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని మాతృ సంస్థ భారతీ టెలికామ్ నిర్ణయించింది.

యూనిట్‌కు రూ.558 చొప్పున దాదాపు 2.75 శాతం వాటాలను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించాలని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం బ్లాక్ డీల్ ద్వారా ఈ వాటాల సేల్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే గతవారం ఎయిర్‌టెల్ షేర్లు 0.2 శాతం తగ్గింపుతో రూ.593 వద్ద ముగిశాయి.

అంటే బ్లాక్ డీల్ ద్వారా యూనిట్ విక్రయం తక్కువ రేటుకే చేపట్టనున్నారు. 2.75 శాతం వాటాలు అంటే మొత్తం 15 కోట్ల ఈక్విటీ షేర్లు అన్నమాట. షేరుకు రూ.558 ఫ్లోర్ ధర వద్ద ఈ విక్రయాన్ని జెపి మోర్గాన్ నిర్వహించనుంది. ఇప్పటికే ప్రత్యర్థి సంస్థ జియోలో వాటాలను విక్రయించడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.50 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించింది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారతీ ఎయిర్‌టెల్‌లో 2.75 శాతం వాటా విక్రయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: