చరిత్రలోనే తొలిసారి

  టాటా గ్రూప్ బాస్‌ల వేతనాలు 20% వరకు కోత కరోనా వైరస్ సంక్షోభమే కారణం ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ నిర్ణయం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చరిత్రలోనే తొలిసారి టాప్ మేనేజ్‌మెంట్ వేతనాల్లో 20 శాతం వరకు కోత నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ సంక్షోభం వల్ల ఆర్థికంగా ప్రభావం పడడంతో ఖర్చు తగ్గించుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, టాటా గ్రూప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల(సిఇఒల) వేతనాల్లో […] The post చరిత్రలోనే తొలిసారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాటా గ్రూప్ బాస్‌ల వేతనాలు 20% వరకు కోత

కరోనా వైరస్ సంక్షోభమే కారణం
ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ నిర్ణయం

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చరిత్రలోనే తొలిసారి టాప్ మేనేజ్‌మెంట్ వేతనాల్లో 20 శాతం వరకు కోత నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ సంక్షోభం వల్ల ఆర్థికంగా ప్రభావం పడడంతో ఖర్చు తగ్గించుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, టాటా గ్రూప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల(సిఇఒల) వేతనాల్లో ఈ కోతలు చేపట్టనుంది. యాజమాన్యం జీతం తగ్గింపు టాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి. ఉద్యోగులను ప్రోత్సహించడానికి, సంస్థపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

టిసిఎస్ సిఇఒ మొదటిసారి ప్రకటన
టాటా గ్రూప్ ప్రధాన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిఇఒ రాజేష్ గోపీనాథన్ తొలిసారిగా జీతాల కోత ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఇంతకు ముందు ఇండియన్ హోటల్స్ తెలిపింది. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్ సిఇఒ, ఎండిలు కూడా తమతమ జీతాలు తగ్గించుకోనున్నట్లు సమాచారం. ఈ తగ్గింపు ప్రధానంగా ప్రస్తుత సంవత్సరం బోనస్‌కు వర్తిస్తుందని ఈ విష యం తెలిసిన మరో సీనియర్ అధికారి తెలిపారు.

వ్యాపారాన్ని రక్షించేందుకే..
టాటా గ్రూప్ చరిత్రలోనే తొలిసారిగా వ్యాపారాన్ని పరిరక్షించడానికి ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు అన్నారు. నాయకత్వం సానుభూతితో ఉండే అన్ని చర్యలు తీసుకుంటుందని, గ్రూప్ తన దిగువ ఉద్యోగులను రక్షించడానికి ఈ నిర్ణయాలు చేపట్టిందని అన్నారు. ఇటీవల టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ప్రతి గ్రూప్ సంస్థ హెచ్‌ఆర్ పాలసీ, రెవెన్యూ ప్లానింగ్, నగదు ప్రవాహ నిర్వహణను సమీక్షిస్తామని అన్నారు.
గతేడాదిలో సిఇఒల జీతం 11% పెరిగింది
2019 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ కంపెనీల సిఇఒల జీతాలు సగటున 11 శాతం పెరిగాయి. అంతకుముందు 2018 ఆర్థిక సంవత్సరంలో జీతం 14 శాతం పెరిగింది. టిసిఎస్ మినహా గ్రూప్‌లోని ఇతర కంపెనీలు 2020 ఆర్థిక సంవత్సరానికి ఇంకా వార్షిక నివేదికలను సమర్పించలేదు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం 2019 ఆర్థిక సంవత్సరంలో 19 శాతం పెరిగి రూ.65.52 కోట్లకు చేరింది. టాటా సన్స్ నుండి 54 కోట్ల రూపాయల లాభం కూడా ఇందులో ఉంది.

2019లో సేల్స్ 10 శాతం పెరిగాయి
గత ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ లిస్టెడ్ 33 కంపెనీల అమ్మకాలు 10 శాతం పెరిగి రూ.7.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టిసిఎస్ వంటి మూడు ప్రధాన సంస్థలు టాటా గ్రూప్‌లో 82 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 33 కంపెనీల లాభాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తక్కువ. 2019 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ లాభాల్లో టిసిఎస్ రూ.32,340 కోట్లు, టాటా స్టీల్ రూ.10,218 కోట్లు అందించాయి.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చరిత్రలోనే తొలిసారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: