రేపు సిఎం ఉన్నతస్థాయి సమీక్ష

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరొనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చిస్తారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. […] The post రేపు సిఎం ఉన్నతస్థాయి సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

కరొనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చిస్తారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంతకాలం ఇలాగే కొనసాగించాలా? లేక ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా చర్చిస్తారు.

CM KCR to chair high-level meeting on May 27

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేపు సిఎం ఉన్నతస్థాయి సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: