రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా కేసులు

కొత్తగా 66 పాజిటివ్‌లు, 72 మంది డిశ్చార్జ్, మరో ముగ్గురు మృతి జిహెచ్‌ఎంసిలో 31, రంగారెడ్డిలో ఒకరితో పాటు 15 మంది మైగ్రెంట్స్‌కు వైరస్ 18 మంది విదేశీయులకు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తికీ నిర్ధారణ ఛత్రినాక కానిస్టేబుల్‌కు కరోనా 1920కి చేరిన కోవిడ్ బాధితులు 56కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 66 పాజిటివ్‌లు నమోదు కాగా, 72 […] The post రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొత్తగా 66 పాజిటివ్‌లు, 72 మంది డిశ్చార్జ్, మరో ముగ్గురు మృతి
జిహెచ్‌ఎంసిలో 31, రంగారెడ్డిలో ఒకరితో పాటు 15 మంది మైగ్రెంట్స్‌కు వైరస్
18 మంది విదేశీయులకు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తికీ నిర్ధారణ
ఛత్రినాక కానిస్టేబుల్‌కు కరోనా
1920కి చేరిన కోవిడ్ బాధితులు
56కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 66 పాజిటివ్‌లు నమోదు కాగా, 72 మంది డిశ్చార్జ్ అయ్యారు.

వైరస్ దాడిలో మరో మగ్గురు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ అధికారుల బులిటెన్‌లో పేర్కొన్నారు. సోమవారం వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసిలో 31, రంగారెడ్డిలో ఒకరు, పదిహేను మంది వలస కార్మికులతో పాటు మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు చెత్రినాక పోలీస్టేషన్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. ఇదిలా ఉండగా, మృతి చెందిన వారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1920కి చేరగా, డిశ్చార్జ్ ల సంఖ్య 1164కి పెరిగింది.

ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 7A00 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. అయితే సోమవారం కూడా మరో ముగ్గురు వ్యక్తులు వైరస్‌కు బలి కావడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 56కు పెరిగింది. అంతేగాక వైరస్ నిర్ధారణ అయిన 66 మందిలో కేవలం 32 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని అధికారులు ధ్రువీకరించారు. అయితే గ్రేటర్ పరిధిలో నమోదవుతున్న కొన్ని కేసుల్లో ఇప్పటి వరకు లింక్ లభించలేదని, వాటిని అన్వేషించే పనిలో ఉన్నామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

వలస కూలీలలతో జిల్లాల్లో పెరుగుతున్న కేసులు…
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రానికి వస్తున్న వలస కూలీలతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో కేసులు బారీగా పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాల్లో సోమవారం కూడా మరో నాలుగు కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు. ముంబాయి నుంచి వచ్చిన వలస కార్మికులను క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించగా వైరస్ నిర్థారణ అయినట్లు ఆయన తెలిపారు. బుగ్గారం మండలం మద్దునూర్, కొడిమ్యాల మండలం నాచుపెల్లి, ధర్మపురి మండలం రామయ్యపల్లే, మల్యాల మండలం లంబాడి పెల్లి గ్రామాలలో ఒక్కోక్కరికి పాజిటివ్ తేలిందని తెలిపారు. వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి పంపించామని స్పష్టం చేశారు.

66 new Covid cases in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: