కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

  మన తెలంగాణ/హైదరాబాద్ : నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటైన నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పలు గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసిన విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వం కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను కూడా ఏర్పాటుచేసింది. వాటిల్లో శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (కరీంనగర్), […] The post కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్ : నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటైన నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పలు గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసిన విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వం కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను కూడా ఏర్పాటుచేసింది. వాటిల్లో శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (కరీంనగర్), నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (నిజామాబాద్), సిద్దిపేట్ పట్టణాభివృద్ధి సంస్థ (సిద్దిపేట్), స్థంబాంద్రి పట్టణాభివృద్ధి సంస్థ (ఖమ్మం)ల పరిధిలోకి కూడా పలు పలు గ్రామాలను తీసుకొచ్చింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్ గడువు వాస్తవానికి ఈ నెల 31వ తేదీ నాటితో ముగియనుంది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు నెలలుగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నెలల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: