ఇంట్లోనే..

  112 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వీధుల్లో కనిపించని రంజాన్ సందడి నాడు మూసీ వరదలు, నేడు కరోనా మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. రంజాన్ మాసంలో ఎప్పుడు కళకళలా డే నగరం ఇప్పుడు కళ తప్పింది. చార్మినార్, మక్కామసీదు ప్రాంతాలు అన్నీ నిర్మానుష్యంగా గోచరించా యి. కరోనా లాక్‌డౌన్ నిబంధనలతో ముస్లిం సోదరులంతా ఇళ్లల్లోనే నమాజు చేసుకుని రంజాన్ వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. ఎప్పుడు రద్దీగా, సామూహిక ప్రార్థనలు జరిగే రంజాన్ […] The post ఇంట్లోనే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

112 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వీధుల్లో కనిపించని రంజాన్ సందడి
నాడు మూసీ వరదలు, నేడు కరోనా

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. రంజాన్ మాసంలో ఎప్పుడు కళకళలా డే నగరం ఇప్పుడు కళ తప్పింది.

చార్మినార్, మక్కామసీదు ప్రాంతాలు అన్నీ నిర్మానుష్యంగా గోచరించా యి. కరోనా లాక్‌డౌన్ నిబంధనలతో ముస్లిం సోదరులంతా ఇళ్లల్లోనే నమాజు చేసుకుని రంజాన్ వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. ఎప్పుడు రద్దీగా, సామూహిక ప్రార్థనలు జరిగే రంజాన్ పండుగ ఇలా జరగడం 112 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షతో ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అలాంటిది కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో ఈ మారు ఎవరికి వారుగా ఇళ్లల్లోనే ఉండి నమాజు చేసుకుంటూ రంజాన్ పండుగను ఎలాంటి ఆర్భాటం లేకుండా చేసుకున్నారు.

కళ తప్పిన పాతబస్తీ.. కోట్లలో ఆదాయానికి గండి…
కాగా, రంజాన్ మాసంలో పాతబస్తీలోని చార్మినార్ తదితర ప్రాంతాలన్నీ జనరద్దీతో కిటకిటలాడిపోయేవి. రంజాన్ మాస సందర్భంలో ఇక్కడ నైట్ బజార్ నిర్వహించేవారు. ఆ సమయంలోనే ఇక్కడి వ్యాపారులు సంవత్సర ఆదాయం గడించేవారంటే అతిశయోక్తి కాదు. ఈ నైట్ బజార్‌లలో గాజులు తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు జిల్లాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉండేది. కరోనా నిబంధనలతో ఈ మారు ఆ ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి.

కరోనాతో ఈ మారు తాము కోట్లలో నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు. ఆదాయానికి పూర్తిస్థాయిలో గండి పడినట్లైంది. ఇక రంజాన్ మాసంలో ఎక్కడ చూసిన హలీమ్ విక్రయాలు కొనసాగేవి. కరోనా నిబంధనలతో హలీమ్ తయారీదారులు సైతం హలీమ్‌ని విక్రయించలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. సామూ హిక మతప్రార్థనలకు అనుమతి నివ్వలేదు. మత పెద్దలు సైతం ఇళ్లల్లోనే నమాజు చేసుకోవాలని ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ మారు రంజాన్ పండుగను ముస్లిం సోదరులంతా ఇళ్లల్లోనే ఉండి నిరాడంబరంగా జరుపుకున్నారు.

నాడు మూసీ వరదలు.. నేడు కరోనా మహమ్మారి…
ప్రస్తుత పరిస్థితులు 112 ఏళ్ల క్రితం నాటి సంఘటనను గుర్తు చేస్తున్నాయని అప్పటి విషయాలను నెమరవేసుకున్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లన్నీ బురదమయంగా మారడంతో మసీదులకు ఎవరూ వెళ్లలేకపోయారు. దీంతో ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఎలాంటి ఆర్భాటం లేకుండా పండగ జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అలాంటి పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంట్లోనే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: