ఒయులో కూల్చివేత

  ఉస్మానియా వర్శిటీలో అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా మన తెలంగాణ /సిటీ బ్యూరో/ తార్నాక : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బల్దియా టౌన్ ప్లానింగ్ వి భాగం సోమవారం కూల్చి వేసింది. కోట్లాది వి లువైన భూములు కబ్జా కాకుండా జిహెచ్ఎంసి అధికారులు కాపాడారు. యూనివర్సిటీ కి చెందిన సుమారు 3,296 చ.గజాల స్థలా న్ని తొమ్మిది మంది వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఒయులో భూముల ఆక్రమణపై […] The post ఒయులో కూల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉస్మానియా వర్శిటీలో అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా

మన తెలంగాణ /సిటీ బ్యూరో/ తార్నాక : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బల్దియా టౌన్ ప్లానింగ్ వి భాగం సోమవారం కూల్చి వేసింది.

కోట్లాది వి లువైన భూములు కబ్జా కాకుండా జిహెచ్ఎంసి అధికారులు కాపాడారు. యూనివర్సిటీ కి చెందిన సుమారు 3,296 చ.గజాల స్థలా న్ని తొమ్మిది మంది వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఒయులో భూముల ఆక్రమణపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ సి.హెచ్ గోపాల్‌రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఒఎస్‌డి ప్రొఫెసర్ టి.కృష్ణారావులు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ఉస్మానియా స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో కబ్జాదారులు ఆక్రమించిన స్థలాల్లో రాత్రి రాత్రే ప్రహారీ గోడలు నిర్మించడంతో అప్రమత్తమైన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సోమవారం ఈ అక్రమ నిర్మాణాలను తొలగించారు.

Illegal constructions demolished in OU

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒయులో కూల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: