భాస్కర్ బాగున్నవా!

  కొండపోచమ్మ నిండడంతో రైతుల కష్టాలు తీరుతాయి మర్కుక్ సర్పంచ్‌కు సడన్‌గా సిఎం కెసిఆర్ నుంచి ఫోన్ ఆశ్చర్య ఆనందాలతో తనను తాను నమ్మలేకపోయిన భాస్కర్ గ్రామాల్లో ప్రజలు మీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు సార్ : భాస్కర్ మర్కుక్ పంచాయతీ ఆదర్శంగా ఉండాలే.. ఆరు కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేసుకుందాం : సిఎం మన తెలంగాణ/గజ్వేల్: సిఎం కెసిఆర్ తన సొంత నియోజకవర్గంలోని మ ర్కూక్ సర్పంచ్‌కు ఫోన్ చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ […] The post భాస్కర్ బాగున్నవా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొండపోచమ్మ నిండడంతో రైతుల కష్టాలు తీరుతాయి

మర్కుక్ సర్పంచ్‌కు సడన్‌గా సిఎం కెసిఆర్ నుంచి ఫోన్
ఆశ్చర్య ఆనందాలతో తనను తాను నమ్మలేకపోయిన భాస్కర్

గ్రామాల్లో ప్రజలు మీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు సార్ : భాస్కర్

మర్కుక్ పంచాయతీ ఆదర్శంగా ఉండాలే.. ఆరు కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేసుకుందాం : సిఎం

మన తెలంగాణ/గజ్వేల్: సిఎం కెసిఆర్ తన సొంత నియోజకవర్గంలోని మ ర్కూక్ సర్పంచ్‌కు ఫోన్ చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ సర్పంచ్ భాస్కర్‌తో సిఎం కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి గ్రామ ప్రజల బాగోగులు, అభివృద్దిపనుల పురోగతితో పాటు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం, ఒకే చోట 15 వందల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌కు స్థలం పరిశీలన తదితర అంశాల పై చర్చించారు. ఇలా అనూహ్యంగా సిఎం నుంచి ఫోన్ కాల్ రావడంతో సర్పంచ్ భాస్కర్ ఆశ్చర్యం, ఆనందంతో కొద్దిసేపు తడబడ్డారు.

కెసిఆర్, మర్కుక్ సర్పంచి భాస్కర్ మధ్య జరిగిన మాటామంతి ఇలా సాగింది…

కెసిఆర్: ఏం భాస్కర్ బాగున్నవా?
సర్పంచ్ భాస్కర్ : సార్! నమస్తే సార్! బాగున్నం సార్..
కెసిఆర్: ఊరెట్లా ఉందయ్యా , ఊల్లె అందరు బాగున్నారా! అన్ని అభివృద్ది పనులు పూర్తయినయా, ఇంకేమన్న మిగిలి ఉన్నయా
సర్పంచ్: ఊరు బాగానే ఉంది సార్. మీరు చె ప్పినట్లు పనులన్నీ బాగానే జరుగుతున్నయి సార్. సార్.. మర్కూక్ గ్రామ పంచాయతీ భవనాన్ని మోడల్ భవనంగా కట్టుకోవాలను కుంటున్నం సార్, దీనికి నిధులు కావాలి సార్
కెసిఆర్: జిల్లాలో మర్కూక్ గ్రామ పంచాయతీ ఆదర్శంగా ఉండాలె. మంచి భవనం కట్టుకుందాం, ఒక మంచి సమావేశ మందిరం నిర్మాణంతో పాటు ఇంకా ఏమైనా పెండింగ్ పనులుంటే వాటిని కూడా రూ.6కోట్లు వ్యయం చేసి పూర్తిచేసుకుందాం సరేనా. గ్రామాన్ని అభివృద్దిలో ఉంచాలి. మరింత కష్టపడి పనిచేసి ప్రజలతో కలిసి గ్రామ అభివృద్దిని చూడాలి భాస్కర్.
సర్పంచ్: సరే సార్ మీరు చెప్పినట్లే నేను గ్రామాభివృద్ది కోసం కష్టపడుతాను సార్.
కెసిఆర్: బ్రహ్మాండంగా కొండ పోచమ్మ సాగర్ నిర్మించుకున్నం..దాన్ని త్వరలో ప్రారంభం చేసుకోబోతున్నం కదా, జనం ఏమనుకుంటున్నరు?
సర్పంచ్: ప్రజల ఆనందానికి అంతేలేదు సార్. ముఖ్యంగా రైతులైతే ఇంకా సంతోషంగా ఉన్నరు సార్, కలలో కూడా అనుకోని విధంగా గోదావరి నీళ్లు రావటంతో ఆనందంతో గ్రామాల్లో ప్రజలు మీచిత్ర పటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు సార్.
కెసిఆర్: త్వరలో కొండపోచమ్మ సాగర్‌ను ప్రారంభించుకోబోతున్నాం. రైతులు సంతోషంగా ఉంటారు. ఈ ప్రాంతంలో మంచి పంటలు పండుతాయి. కొండపోచమ్మ సాగర్‌తో రైతుల కష్టాలు ఇక తీరినట్లే.. కొండపోచమ్మ ప్రారంభం రోజు అక్కడి పరిసరాలలో వాహనాల పార్కింగ్‌కు స్థలం, సుమారు 15వందల మందికి సరిపడే విధంగా కాన్ఫరెన్స్ హాల్ , భోజనాలు తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంది. సరే తర్వాత కలుద్దాం అంటూ సిఎం కెసిఆర్ ఫోన్ పెట్టేసినటు సర్పంచి భాస్కర్ మీడియాకు తెలిపారు.

CM KCR Called to Markook Sarpanch Bhaskar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భాస్కర్ బాగున్నవా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: