జులైలో స్కూళ్లు

  కేంద్ర ప్రభుత్వ యోచన తొలుత 30 శాతం హాజరీ 8వ తరగతిలోపు సెలవే పిల్లల మధ్య ఎడం న్యూఢిల్లీ : దేశంలో పాఠశాలలు జులైలో పునః ప్రారంభవుతాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తగు విధివిధానాలను రూపొందించుకొంటోంది. స్కూళ్ల ఆరంభానికి సోమవారం సంకేతాలు వెలువడ్డాయి. కరోనా కారణంగా దేశంలో అన్ని స్థాయిల విద్యాసంస్థలు రెండు నెలల నుంచి మూతపడ్డాయి. విద్యాసంవత్సరానికి విఘాతం ఏర్పడింది. కరోనా జోన్ల ప్రాతిపదికన దేశంలో స్కూళ్లను తిరిగి తెరుస్తారు. తొలుత 30 […] The post జులైలో స్కూళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్ర ప్రభుత్వ యోచన
తొలుత 30 శాతం హాజరీ
8వ తరగతిలోపు సెలవే
పిల్లల మధ్య ఎడం

న్యూఢిల్లీ : దేశంలో పాఠశాలలు జులైలో పునః ప్రారంభవుతాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తగు విధివిధానాలను రూపొందించుకొంటోంది.

స్కూళ్ల ఆరంభానికి సోమవారం సంకేతాలు వెలువడ్డాయి. కరోనా కారణంగా దేశంలో అన్ని స్థాయిల విద్యాసంస్థలు రెండు నెలల నుంచి మూతపడ్డాయి. విద్యాసంవత్సరానికి విఘాతం ఏర్పడింది. కరోనా జోన్ల ప్రాతిపదికన దేశంలో స్కూళ్లను తిరిగి తెరుస్తారు. తొలుత 30 శాతం హాజరీ ప్రాతిపదికన స్కూళ్లు నిర్వహిస్తారు. చిన్నారులైన విద్యార్థులు ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుంది. తొలి దశలో 8వ తరగతిలోపు విద్యార్థులు స్కూళ్లకు రానవసరం లేదు. భౌతికదూరం పాటించేందుకు వీలుగా కేవలం 30 శాతం మంది విద్యార్థులను అనుమతిస్తారు.

ఆరెంజ్, గ్రీన్‌జోన్లలో స్కూళ్లను తొలుత ఆరంభిస్తారు. పెద్ద క్లాసుల విద్యార్థులకు తొలుత స్కూళ్లను తెరుస్తారని వెల్లడైంది. ఎనిమిదవ తరగతిలోపు విద్యార్థులు పూర్తి స్థాయిలో స్కూళ్ల ఓపెన్ వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. పిన్న వయస్కులైన విద్యార్థులు కటుతరమైన నిబంధనలను పాటించడం కష్టం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారి భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ వారిని ఇంటికే పరిమితం చేస్తారు. అయితే వారు ఇళ్ల నుంచే ప్రస్తుతానికి విద్యాభ్యాసం చేసేలా ఏర్పాట్లు ఉంటాయని వెల్లడైంది.

ఈ వారాంతంలో మార్గదర్శకాలు
స్కూళ్ల రీఓపెన్‌కు సంబంధించి మార్గదర్శకాలను ఈవారాంతం తరువాత విడుదల చేస్తారు. సంబంధిత మంత్రిత్వశాఖలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించిన తరువాత సరైన మార్గదర్శకాలకు వీలుంటుందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ భయాలతో స్కూళ్లు మార్చి 16 నుంచి మూతపడ్డాయి. రెండు నెలలు స్కూళ్లు పనిచేయకపోవడంతో ఇవి ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అయింది. జులైలో ఎప్పుడు స్కూళ్ల పునః ప్రారంభం అనేది స్పష్టం కాలేదు.

సాధారణంగా వేసవి సెలవుల తరువాత జూన్‌లోనే స్కూళ్లు తెరవాల్సి ఉంటుంది. అయితే వీటిని జులైలో రెండు షిప్టుల పద్ధతిలో తిరిగి తెరుస్తారని స్పష్టం అయింది. విద్యార్థులు పాటించాల్సిన అనంతర విధివిధానాలను ముందుగా అధ్యాపకులు తెలుసుకోవల్సి ఉంటుంది. స్కూళ్లలో ఉదయం పూట సామూహిక సమ్మేళన ప్రార్థనలు ఇతరత్రా సమావేశాలు ఉండవు. తక్కువ మంది హాజరీ పద్ధతితో స్కూళ్లు రీఓపెన్ దిశలో ఆలోచిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.

ఒక్కో స్కూల్‌లో 40 మంది అంతకు మించి విద్యార్థులు ఉంటే అది ఆరోగ్య భద్రత నిబంధనలకు విరుద్ధం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, అధ్యాపకుల ప్రాణాలు, వారి ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని అధికారులతో ఇష్టాగోష్టిలో ఆయన తెలిపారు. స్కూళ్లలో పాటించాల్సిన నియయనిబంధనల గురించి , భద్రతా చర్యల విషయంపై ఇప్పటికే యుజిసి, ఎన్‌సిఇఆర్‌టి ఇప్పటికే పరిశీలన చేపట్టింది. వారు రూపొందించే పద్ధతులను అమలులోకి తెస్తారని విద్యా, మానవ వనరుల మంత్రిత్వశాఖలు తెలియచేశాయి.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జులైలో స్కూళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: