టాప్ 10లో ఇండియా

  వరుసగా నాలుగో రోజు కరోనా జోరు లాక్ డౌన్ సడలింపులతో పెరిగిన గ్రాఫ్ మహారాష్ట్రలో మొత్తం మృతులు 1635 న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వరుసగా నాలుగు రోజులు వైరస్ పెరుగుతూ పోవడం ఆందోళనకర పరిణామంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 ఉధృతి ఉన్న దేశాల జాబితాలో ఇప్పుడు ఇండియా 10వ స్థానంలోకి చేరింది. వైరస్ పరిస్థితిపై సోమవారం అధికారికంగా వెలువడ్డ సమాచారంతో ఈవిషయం స్పష్టం […] The post టాప్ 10లో ఇండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరుసగా నాలుగో రోజు కరోనా జోరు
లాక్ డౌన్ సడలింపులతో పెరిగిన గ్రాఫ్
మహారాష్ట్రలో మొత్తం మృతులు 1635

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వరుసగా నాలుగు రోజులు వైరస్ పెరుగుతూ పోవడం ఆందోళనకర పరిణామంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 ఉధృతి ఉన్న దేశాల జాబితాలో ఇప్పుడు ఇండియా 10వ స్థానంలోకి చేరింది. వైరస్ పరిస్థితిపై సోమవారం అధికారికంగా వెలువడ్డ సమాచారంతో ఈవిషయం స్పష్టం అయింది. గత 24 గంటలల్లో దేశంలో 6997 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం రోగుల సంఖ్య 1.38 లక్షలకు చేరింది. ఇక మరింత ఆందోళనకర పరిణామంగా ఒక్కరోజే 154 మంది కరోనా రోగులు మృతి చెందారు.

దీనితో దేశంలో మొత్తం మృతుల సంఖ్య ఇప్పుడు 4వేలు దాటింది. లాక్‌డౌన్ సడలింపుల దశలో దేశంలో పలు ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి దాఖలాలు కన్పిస్తూ కేసులు పెరుగుతూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ గుర్తించింది. అమెరికా, బ్రెజిల్, చైనా,రష్యా,బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వంటి ఉధృతస్థాయి పది వైరస్ దేశాల జాబితాలో ఇండియా చేరింది. గత నాలుగు రోజులుగా ఇండియాలో ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ సడలింపు తరువాతి దశలలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో ఒక్కరోజే 3401 కేసులు
దేశంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ ఉధృతి ఉన్న మహారాష్ట్రలో పరిస్ధితి మరింత దిగజారింది. ఇక్కడ ఒక్కరోజు వ్యవధిలోనే 3041 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50231కి చేరింది. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 1635గా ఉంది. దేశం మొత్తం మీద కేసులతో పోలిస్తే సగభాగం వరకూ ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లో ఒక్కరోజే 394 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 14,063కి చేరింది.

వైరస్ కాటుతో మరో 30 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య ఇక్కడ 858కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర తరువాత గుజరాత్‌లో కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. తమిళనాడులో కొత్తగా 765 కేసులు రికార్డు అయ్యాయి. దీనితో మొత్తం రోగుల సంఖ్య 16 వేలు దాటింది. 111 మంది చనిపొయ్యారు. ఢిల్లీలో కొత్త కేసులు 508 కాగా మొత్తం కేసుల సంఖ్య 13,418 అయింది. ఇక్కడ మృతుల సంఖ్య 261కి చేరింది. రాజస్థాన్‌లో 286 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 6915కు చేరింది. మృతుల సంఖ్య 163కు చేరుకుందని అధికారిక గణాంకాలలో వెల్లడైంది

రెండు జిల్లాల్లో జూన్ 30 వరకూ లాక్‌డౌన్
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్, సోలాన్ జిల్లాలో లాక్‌డౌన్‌ను జూన్ 30వరకూ కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఈ నెల 31వతేదీతో ముగియాల్సి ఉంది. అయితే జిల్లాల్లో వైరస్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జిల్లా కలెక్టర్లు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. వైరస్ నియంత్రణకు ప్రజల రాకపోకల నియంత్రణకు వీలుగా కర్ఫూ విధిస్తున్నట్లు తెలిపిన ఈ ఉత్తర్వులలో లాక్‌డౌన్ అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేయలేదు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టాప్ 10లో ఇండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: