మరో పెళ్లి కోసం…. భార్యపై పామును విసిరి…

  తిరువనంతపురం: ఓ వ్యక్తి భార్యను వదిలించుకోవడానికి… ఆమెను పాము కాటుతో చంపించిన సంఘటన కేరళలో కొల్లామ్‌లో జరిగింది. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సూరజ్-ఉత్తర అనే దంపతులు అంకల్ ప్రాంతంలో నివస్తిన్నారు. సూరజ్ తన భార్యను చంపేయాలని మర్డర్ ప్లాన్ వేశాడు. సూరజ్ తన స్నేహితుడు సురేష్ తో మర్డర్ ప్లాన్ గురించి చెప్పాడు. సురేష్ పాములను పట్టి వ్యక్తితో సూరజ్ కు పరిచయం చేశాడు. […] The post మరో పెళ్లి కోసం…. భార్యపై పామును విసిరి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం: ఓ వ్యక్తి భార్యను వదిలించుకోవడానికి… ఆమెను పాము కాటుతో చంపించిన సంఘటన కేరళలో కొల్లామ్‌లో జరిగింది. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సూరజ్-ఉత్తర అనే దంపతులు అంకల్ ప్రాంతంలో నివస్తిన్నారు. సూరజ్ తన భార్యను చంపేయాలని మర్డర్ ప్లాన్ వేశాడు. సూరజ్ తన స్నేహితుడు సురేష్ తో మర్డర్ ప్లాన్ గురించి చెప్పాడు. సురేష్ పాములను పట్టి వ్యక్తితో సూరజ్ కు పరిచయం చేశాడు. మే 6 రాత్రి సూరజ్ పామును పట్టుకొని ఆ ఇద్దరితో కలిసి తన ఇంటికి వెళ్లాడు. భార్య బెడ్ రూమ్‌లో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమెపై పామును విసిరేశారు.

భార్యను రెండు సార్లు పాము కరిచిన తరువాత పాము పట్టుకొవడానికి ప్రయత్నించినప్పటికి కానీ పాము కప్‌బోర్డు కిందకు వెళ్లిపోయింది. భర్త తెల్లవారుజాము వరకు అక్కడే ఉండి తరువాత బయటకు వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రులు తన కూతురు ఇంటికి చేరుకునేసరికి చనిపోయినట్టు గుర్తించారు. అదే రూమ్‌లో పాము ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పామును పట్టుకున్నారు. అడూర్ ప్రాంతంలో మార్చ్ 5న గతంలో తన కూతురిని పాము కరిచిందని, అప్పుడు ప్రాణాలతో బయటపడిందని పోలీసులకు తెలిపారు. ఇప్పుడు తన కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే అల్లుడు సూరజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన స్నేహితుడు సురేష్, పాములు పట్టేవాడితో కలిసి తన భార్యను చంపానని ఒప్పుకున్నాడు. తన భార్యకు సంబంధించిన 98 సవార్ల నగలు, నగదును వాడుకున్నానని, మరో పెళ్లి చేసుకోవడానికి భార్యను పాము కాటుతో చంపేశానని పోలీసుల ఎదుట నిజాలు ఒప్పుకున్నాడు.

The post మరో పెళ్లి కోసం…. భార్యపై పామును విసిరి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: