నేటి నుంచి దేశీయ విమానయానం

  నేటి నుంచే దేశీయ విమాన సేవలు ప్రారంభం కేసుల తీవ్రత దృష్టా పలు రాష్ట్రాల్లో సొంతంగా ఆంక్షల అమలు రోజూ 50 విమానాలను ఆమోదించిన మహారాష్ట్ర కోల్‌కతాకు 40 విమానాలు నడిపే అవకాశం న్యూఢిల్లీ : రెండు నెలల అంతరాయం తర్వాత సోమవారం(నేటి) నుంచి దేశీయ విమాన సంస్థలు ప్రయాణికుల సేవలను ప్రారంభించనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో సొంతంగా అమలు చేస్తున్న ఆంక్షల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి […] The post నేటి నుంచి దేశీయ విమానయానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేటి నుంచే దేశీయ విమాన సేవలు ప్రారంభం
కేసుల తీవ్రత దృష్టా పలు రాష్ట్రాల్లో సొంతంగా ఆంక్షల అమలు
రోజూ 50 విమానాలను ఆమోదించిన మహారాష్ట్ర
కోల్‌కతాకు 40 విమానాలు నడిపే అవకాశం

న్యూఢిల్లీ : రెండు నెలల అంతరాయం తర్వాత సోమవారం(నేటి) నుంచి దేశీయ విమాన సంస్థలు ప్రయాణికుల సేవలను ప్రారంభించనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో సొంతంగా అమలు చేస్తున్న ఆంక్షల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాలు విమాన సేవలను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రా కరోనా వైరస్ వ్యాప్తి, కేసులు పెరగడమే. దీంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సేవల పట్ల విముఖ త వ్యక్తం చేస్తుండగా, విమాన సంస్థలకు ఇబ్బందులు తప్పేలా లేవు. రెడ్ జోన్‌లో విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించడం తీవ్రమైన అనారోగ్యకరమైన ఆలోచన అని ఆదివారం ట్విట్టర్‌లో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఇక కొద్ది రోజుల పాటు కోల్‌కతా, బాగ్దోగ్రా విమానాశ్రయాల్లో సేవలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు.

1050 విమానాలు నడుస్తాయి: కేంద్రం
నేడు 1050 విమానాలు నడుస్తాయని విమానయాన శాఖ తెలిపింది. అయితే విమానాలు, నిర్బంధ కాలాలు, రాష్ట్రాల మధ్య ప్రయాణీకుల విధానాలకు సంబంధించిన పరిస్థితులు స్పష్టంగా లేవు. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు దేశీయ విమానాలకు అనుకూలంగా లేవు. అయితే మొదట తమిళనాడు విమానాలను అనుమతించి ఆదివారం ప్రయాణీకులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు రోజు 50 విమానాల నిర్వహణకు మహారాష్ట్ర ఆమోదం తెలిపింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కోల్‌కతాకు విమానాలను మే 30 వరకు, బాగ్డోగ్రా విమానాశ్రయాన్ని మే 28 వరకు వాయిదా వేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరినట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఎందుకంటే తుఫాను తరువాత రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో బిజీగా ఉంది.

ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి
ఆరోగ్యసేతు యాప్ వినియోగం తప్పనిసరిగా వినియోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. చేయాల్సినవి, చేయకూడవి వంటి నిబంధనల జాబితాను కూడా సిద్ధం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో విమానం, రైలు లేదా బస్సులో వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. కేరళ, ఒడిశా, అసోం, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విమాన ప్రయాణికులు 14 రోజులు దిగ్బంధంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నిబంధనలే విధించాయి.

14 రోజుల క్వారంటైన్
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాశ్రయం చేరుకోవడానికి ముందు ప్రయాణికులు అందరూ 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి అని తెలిపింది. ఆగస్టు నాటికి అంతర్జాతీయ ప్రయాణికుల సేవలు మెరుగవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.

Domestic flights start from today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేటి నుంచి దేశీయ విమానయానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: