సిఎం మాటే సాగుబాట

  సిఎం ఆదేశాలకు అనుగుణంగా కదిలిన మంత్రులు అనుకూల, డిమాండ్ పంటలపై అవగాహన సదస్సులు నియంత్రిత పంటలపై అవగాహన కలిగించడానికి కదిలిన మంత్రులు, అవగాహన సదస్సులు, గ్రామాల్లో రైతుల అనుకూల తీర్మానాలు మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై రైతులను జాగృతం చేసేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ఎంఎల్‌ఎలు, అధికారులు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌లతో కలిసి రైతులను చైతన్యం చేస్తున్నారు. వానాకాలం నియంత్రిత సాగు సన్నాహాక సమావేశాలు […] The post సిఎం మాటే సాగుబాట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిఎం ఆదేశాలకు అనుగుణంగా కదిలిన మంత్రులు
అనుకూల, డిమాండ్ పంటలపై అవగాహన సదస్సులు

నియంత్రిత పంటలపై అవగాహన కలిగించడానికి కదిలిన మంత్రులు, అవగాహన సదస్సులు, గ్రామాల్లో రైతుల అనుకూల తీర్మానాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై రైతులను జాగృతం చేసేందుకు మంత్రులు రంగంలోకి దిగారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ఎంఎల్‌ఎలు, అధికారులు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌లతో కలిసి రైతులను చైతన్యం చేస్తున్నారు. వానాకాలం నియంత్రిత సాగు సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతిపాదించిన సాగు వివరాలను ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి.. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే పంట ఉత్పత్తులు ఏమిటి? ఏమి పండిస్తే లాభం అనేవి వివరిస్తున్నారు. ఆదివారం కొందరు మంత్రులు జిల్లా సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్దేశాలను వివరించారు. జనగాం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఏయే నేలల్లో, ఎక్కడెక్కడ ఏ పంటలు వస్తే లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. డిమాండ్ ఉన్న పంట లు, మార్కెట్ ఎలా ఉందో కూడా ప్రభుత్వమే చెబుతుందన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే.. రైతుబంధు వంటి పథకాలు అందుతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా పడిసి పంటలు పండిద్దామని పిలుపునిచ్చారు. జనగాం జిల్లాలో వానాకలం పంటల సాగు అంచనా 2.90 లక్షల ఎకరాలుగా ఉందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొతిరెడ్డి పాడుకు పొక్కలు పెట్టింది కాంగ్రెస్, టిడిపిలేనన్నారు. జనగాం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టె ఆలోచన సిఎం చేస్తున్నారన్నారు.

సిద్ధిపేటలో నియంత్రిత సాగు ఏకగ్రీవాలు
పలు సందర్భాల్లో ఆదర్శంగా నిలుస్తున్న సిద్ధిపేట నియంత్రిత సాగులోనూ అదేతీరును కనబరుస్తోంది. మంత్రి హరీశ్‌రావు పిలుపుకు నియంత్రిత సాగు అమలుకు అన్ని గ్రామాలకు ఏకతాటిపైకి వస్తున్నాయి. సిద్ధిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలంలోని మైనంపల్లి, నాగరాజుపల్లి రెండు గ్రామాలలో, సిద్ధిపేట రూరల్ మండ లం పెద్ద లింగారెడ్డి గ్రామంలో ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేసేందుకు రైతులంతా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు.

కొరత ఉన్నా అందుబాటులో ఉంచేందుకు కృషి
ఆదిలాబాద్‌లో నియంత్రిత సాగు విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రైతులందరూ నియంత్రిత సాగు విధానంపై మొగ్గుచూపేలా యంత్రాంగం కృషి చేయాలన్నారు. సబ్సిడీ విత్తనాలను అక్రమంగా అమ్ముకునే వారిపై పి.డి యాక్టు కేసులు పెడుతామన్నారు. లాక్‌డౌన్‌తో సోయా విత్తనాల కొరత ఉన్నప్పటికీ రైతులకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తామన్నారు.

సాగు నీటికి కొరత లేని జిల్లా కరీంనగర్
వానాకాలం 2020 పాటించవల్సిన వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పన విధానంపై కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో ఆదివా రం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమం త్రి సమావేశం తర్వాత ఏఏ జిల్లాలో ఏఏ పంటలు పండి ంచాలన్నది వివరంగా వ్యవసాయ అధికారులు జిల్లాలోని భూసార పరీక్షలు నిర్వహించి అందులో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించవచ్చు, ఎలాంటి పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వచ్చి రైతులకు ఎక్కువ ఆదాయం సమకూరుతుంది అన్న దానిపై అవగాహన కల్పించాలని అన్నారు.

ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవన పథకం ద్వారా అన్ని నియోజకవర్గాలలో నీటికి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా ఎల్‌ఎండి కెనాల్స్ ద్వారా నీరు వదిలినప్పుడు మాత్రమే పంటలు పండించడానికి వీలు ఉండేదని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలోని అన్ని చెరువులలోని నీరు పూర్తిస్థాయిలో నింపడం జరిగిందన్నారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపి వెంకటేష్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావు, జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్లు కనుమల్ల విజయ, పుట్ట మధుకర్, వసంత, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్‌బాబు, కోరుగంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సంజయ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లాల కలెక్టర్లు కె.శశాంక, సిక్తా పట్నాయక్, రవి, నగర మేయర్ వై.సునీల్‌రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎస్‌ఆర్‌ఎస్‌పి సి.ఇ. శంకర్, వ్యవసాయ శాఖాధికారులు, ఏ.డీ.లు తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ చెప్పిన పంట వేయకున్నా.. రైతుబంధు
కెసిఆర్ చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు ఇవ్వరని దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులందరికీ యధావిధిగా రైతుబంధు అందుతుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో లాభసాటి వ్యవసాయం ధానంపై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం సూచించినట్లు లాభసాటి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు డిమాండ్ మేరకు పంటను వేసుకుని, నచ్చిన ధరకు అమ్ముకోవచ్చునన్నారు. పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతులు ఎవరికి చేయి చాచొద్దని సిఎం ధ్యేయమన్నారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎం మాటే సాగుబాట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: