‘దోమలకు దడ’అంటురోగాలకు తెర

  మరి పది వారాలు డ్రై సండేస్ ప్రతి ఆదివారం 10 గంటలకు నిమిషాలు పరిసరాల్లోని నిల్వ నీటిని తొలగిద్దాం… ప్రతి ఒక్కరం పారిశుద్ధ్దంలో పాల్గొందాం మన తెలంగాణ/హైదరాబాద్: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమములో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తన ఇంటిలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటి పరిశీలనతో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ […] The post ‘దోమలకు దడ’ అంటురోగాలకు తెర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మరి పది వారాలు డ్రై సండేస్

ప్రతి ఆదివారం 10 గంటలకు నిమిషాలు

పరిసరాల్లోని నిల్వ నీటిని తొలగిద్దాం…
ప్రతి ఒక్కరం పారిశుద్ధ్దంలో పాల్గొందాం

మన తెలంగాణ/హైదరాబాద్: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమములో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తన ఇంటిలో భాగస్వాములయ్యారు.

ఇందులో భాగంగా ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటి పరిశీలనతో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరచారు. దీంతోపాటు ప్రగతిభవన్‌లోని గార్డెన్‌లో ఎక్కడైనా వాననీరు పేరుకపోయిందా? అని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యాధులు ప్రబలకుండా కేవలం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోనే సాధ్యం కాదన్నారు. ఇందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాల్సిన అవసముందన్నారు.

ఇందుకు కేవలం ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి తమ ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దీని వల్ల దోమల వ్యాప్తిని మరింత త్వరగా నియంత్రించేందుకు అవకాశముంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి వ్యక్తి తమ వంతు సామాజిక బాధ్యతగా భావించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పది వారాల పాటు కొనసాగించాలని కోరారు. ఫలితంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధుల ను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

జోరుపెంచిన మంత్రులు, పార్టీ నేతలు
అంటువ్యాధుల ప్రమాదాన్ని ముందస్తుగానే కట్టడి చే సేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు ప్రతి ఆదివారం… పది గంటలకు, పది నిమిషాల పాటు తలపెట్టిన పారిశుద్ధ కార్యక్రమంలో మంత్రులు, టిఆర్‌ఎస్ పార్టీ నేతలు మరింత జోరు పెంచారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమాలాకర్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు తమతమ నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దోమల వ్యా ప్తి చెందకుండా పరిశుభ్ర పనులు నిర్వహించాలన్నారు.

డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కార ణం అవుతున్న దోమల నివారణకుగానూ ప్రతి ఆదివారం… 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటి పరిసరాల్లో ని పిచ్చిమొక్కలను, గుబురుగా పెరిగిన ఇంటి ఆవరణలోని మొక్కలను కూడా కత్తిరించాలన్నారు. ఇంటికి సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంకులు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి ఆదివారం నిలువ నీటిని తొలగిద్దాం… వ్యాధులకు కారణం అయ్యే దోమలను పారదోలుదామని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన పట్టణాలను ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైనవి మలుచుకునేందుకు సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులను నివారించవచ్చన్నారు.

Minister KTR calls for Clean drive on Sundays

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘దోమలకు దడ’ అంటురోగాలకు తెర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: