ఆకట్టుకుంటున్న శ్ర‌ద్ధా దాస్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ రిహార్స‌ల్‌ వీడియో..

  హైదరాబాద్: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారికోసం దేవీ చాలా సార్లు విదేశాల్లో మ్యూజిక్ షోలు చేశాడు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన దేవీ ప‌లు మ్యూజిక‌ల్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అల‌రిస్తున్నారు. తాజాగా త‌న తండ్రి స‌త్య‌మూర్తి జ‌యంతి సంద‌ర్భంగా దేవీ ఓ వీడియోని  ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. యూఎస్‌లో ఓ లైవ్ షో కోసం యంగ్ టైగర్ […] The post ఆకట్టుకుంటున్న శ్ర‌ద్ధా దాస్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ రిహార్స‌ల్‌ వీడియో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారికోసం దేవీ చాలా సార్లు విదేశాల్లో మ్యూజిక్ షోలు చేశాడు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన దేవీ ప‌లు మ్యూజిక‌ల్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అల‌రిస్తున్నారు. తాజాగా త‌న తండ్రి స‌త్య‌మూర్తి జ‌యంతి సంద‌ర్భంగా దేవీ ఓ వీడియోని  ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. యూఎస్‌లో ఓ లైవ్ షో కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలోని టైటిల్ సాంగ్ రిహార్స‌ల్‌కి సంబంధించిన వీడియో ఇది. ఇందులో హీరోయిన్ శ్ర‌ద్ధా దాస్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ లు  ఎంతో ఉత్సాహంగా పాటపాడుతూ స్టెప్పులేస్తూ చేసిన రిహార్స్‌ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించిన ఈ వీడియో దేవీ షేర్ చేస్తూ త‌న తండ్రి స‌త్య‌మూర్తికి మ్యూజిక‌ల్ విషెస్ తెలియ‌జేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Devi Sri Prasad rehearsal Rakhi song with Shraddha Das

The post ఆకట్టుకుంటున్న శ్ర‌ద్ధా దాస్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ రిహార్స‌ల్‌ వీడియో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: