నా వెంటపడే ధైర్యం ఎవరూ చేయలేదు

తనకు ‘ప్రేమ’ అంటే చిన్నచూపు అని అంటోంది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం తనకు ప్రేమించే సమయం లేదని చెబుతోంది ఈ బ్యూటీ. “నా దృష్టిలో ప్రేమ అంటే చాలా చిన్న విషయం. అసలు నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వను” అని చెబుతోంది రకుల్. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్‌ను ప్రేమపై మీ అభిప్రాయమేంటి అని అడిగితే… “అసలు ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. స్కూల్లో చదివే సమయంలో ఓ కుర్రాడు […] The post నా వెంటపడే ధైర్యం ఎవరూ చేయలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తనకు ‘ప్రేమ’ అంటే చిన్నచూపు అని అంటోంది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం తనకు ప్రేమించే సమయం లేదని చెబుతోంది ఈ బ్యూటీ. “నా దృష్టిలో ప్రేమ అంటే చాలా చిన్న విషయం. అసలు నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వను” అని చెబుతోంది రకుల్. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్‌ను ప్రేమపై మీ అభిప్రాయమేంటి అని అడిగితే… “అసలు ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. స్కూల్లో చదివే సమయంలో ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడు. నేనేంటి… ప్రేమించడమేంటి… అంటూ పెద్ద క్లాస్ తీసుకున్నాను.

అయితే కాలేజీ రోజుల్లో మాత్రం నా వెంటపడే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటబడ్డా నేను పట్టించుకోలేదు” అని అంటోంది రకుల్. అసలు సమయాన్ని వృథా చేయడం తనకు నచ్చదని… స్కూల్లో చదివే టైంలో అయితే… చదువులోనే కాదు ఆట పాటల్లో కూడా నాదే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పింది ఈ భామ. అందరికంటే ముందుండాలి అని కోరుకునే తత్వమే… తనను ఈ స్థాయికి చేర్చిందని గర్వంగా చెప్పిన రకుల్‌ప్రీత్ సింగ్… ప్రేమలో మాత్రం తనది చివరి స్థానం అని అంటోంది.

Rakul Preet Singh Open up on her Love

The post నా వెంటపడే ధైర్యం ఎవరూ చేయలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: