అభిషేక్ కంటే ఐశ్వర్య ఆస్తులే ఎక్కువ!

  విశ్వసుందరిగా కిరీటం గెలిచి బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ అంటే ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దక్షిణాదిన కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య చివరకు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడింది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్‌లో కుటుంబంతో సరదాగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఇక ఐశ్వర్యారాయ్ నటిగానే కాదు తల్లిగా, భార్యగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే ఐశ్వర్యరాయ్ సంపాదన ఆమె భర్త అభిషేక్ […] The post అభిషేక్ కంటే ఐశ్వర్య ఆస్తులే ఎక్కువ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విశ్వసుందరిగా కిరీటం గెలిచి బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ అంటే ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దక్షిణాదిన కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య చివరకు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడింది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్‌లో కుటుంబంతో సరదాగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఇక ఐశ్వర్యారాయ్ నటిగానే కాదు తల్లిగా, భార్యగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే ఐశ్వర్యరాయ్ సంపాదన ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌ను మించి ఉందని బాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 46 ఏళ్లు. అయినా అందంగా కనపడుతూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. తనకంటే చిన్నవాడైన అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది ఈ భామ.

ఐశ్వర్యరాయ్ 1997లో సినిమా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచే డబ్బును చాలా తెలివిగా కూడబెడుతోంది. స్టార్ హీరోయిన్ గా మారాక వచ్చిన డబ్బును ఆస్తులుగా మలిచింది. ఇప్పటికీ ఆమెకు 260 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఆస్తులున్నాయట. దుబాయ్ సానిటరీ ఫాల్స్‌లో ఐశ్వర్యకు విలాసవంతమైన విల్లా ఉంది. ఇక ఐశ్వర్య ఆభరణాల విలువ కోటికి పైగానే ఉంటుందట. ఇయర్ రింగ్స్ విలువే 70 లక్షలు ఉంటాయట. ఇక ఆమె భర్త బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సొంత ఆస్తుల విలువ చాలా తక్కువ. భార్య ఆస్తులతో పోల్చితే అతని ఆస్తులు చాలా తక్కువట. తండ్రి అమితాబ్ ఆస్తులు కలుపుకుంటే అభిషేక్ ఆస్తులు 200 కోట్లు అని తెలిసింది. ఇందులో అభిషేక్ వాటా తక్కువ. ఇక మొత్తం ఫ్యామిలీ ఆస్తుల విలువ 500 కోట్లుగా ఉంటుందట. ఇప్పటికీ ఐశ్వర్య వివిధ బిజినెస్‌లలో పెట్టుబడులు పెడుతూ సంపాదిస్తోందట.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అభిషేక్ కంటే ఐశ్వర్య ఆస్తులే ఎక్కువ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: