రాష్ట్రంలో మరి 62 కరోనా పాజిటివ్‌లు

ముగ్గురు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. కేవలం 4 రోజుల్లో ఏకంగా 14 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈనెల 19 వ తేది నుంచి 22 వరకు ఏకంగా 14 మంది వైరస్ దాడిలో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. దీంతో పాటు కేసులు సంఖ్య కూడా భారీగా పెరిగింది. శుక్రవారం ఏకంగా 62 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ దాడిలో ముగ్గురు మరణించినట్లు అధికారులు […] The post రాష్ట్రంలో మరి 62 కరోనా పాజిటివ్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ముగ్గురు మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. కేవలం 4 రోజుల్లో ఏకంగా 14 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది.

ఈనెల 19 వ తేది నుంచి 22 వరకు ఏకంగా 14 మంది వైరస్ దాడిలో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. దీంతో పాటు కేసులు సంఖ్య కూడా భారీగా పెరిగింది. శుక్రవారం ఏకంగా 62 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ దాడిలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో బాలాపూర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఉండటం గమనార్హం. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. అయితే ఇతను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో 30 మంది సిబ్బందిని కూడా క్వారంటైన్ చేసి శాంపిల్స్ తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. అంతేగాక మరో రెండ్రోజుల్లో బాలాపూర్ వైద్యసిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేస్తామని జిల్లా అధికారిణి డా ఉమాదేవి వెల్లడించారు.

ఇదిలా ఉండగా, కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 42 మంది, రంగారెడ్డికి చెందిన ఒకరితో పాటు మరో 19 మంది మైగ్రెంట్స్‌కు వైరస్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1761కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1043కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 670 చికిత్స పొందుతుండగా, రాష్ట్రంలో మరణాల సంఖ్య 48కి పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 118 మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందని అధికారులు చెప్పారు. అయితే గత 20 రోజులుగా వలస కార్మికులతోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరంతా ముంభై నుంచి వస్తున్న వారేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి రివ్యూ
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మంత్రి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను సూచించారు. కేసులు పెరుగుతున్న క్రమంలో ఇతర అన్ని ఆసుపత్రుల్లో ఎంత మం ది సిబ్బంది అవసరమవుతారో ఒక రిపోర్టును తయారు చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.

హైరిస్క్ గ్రూప్ వారికి 7 రోజుల్లో టెస్టులు
విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న హైరిస్క్ గ్రూప్ వారికి కేవలం 7 రోజుల్లో కరోనా టెస్టులు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు వివరించారు. క్యాన్సర్ పేషెంట్లు, గర్భిణి స్త్రీలు, డయాలసిస్ రోగులు, ఇతర సీరియస్ కండిషన్ ఉన్న వాళ్లకి 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి అనంతరం టెస్టులు చేస్తున్నామని, ఒకవేళ నెగటివ్ వస్తే వెంటనే వాళ్లని ఇంట్లో సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నట్లు మంత్రి ఈటల కేంద్రమంత్రికి స్పష్టం చేశారు.

అయితే విదేశాల నుంచి వచ్చిన సాధారణ ప్రయాణికులను 14 రోజుల పాటు హోటళ్లలోనే క్వారంటైన్ చేస్తున్నట్లు వివరించారు. డబ్లూహెచ్‌ఓ కార్యనిర్వహక బోర్డ్ చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్షవర్థన్ భాద్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి ఈటల ప్రత్యేకంగా ఫోన్లో అభినందనలు తెలిపారు. అయితే వలస కార్మికులు పెరుగుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల కేంద్రాన్ని కోరారు.

Telangana records 62 new cases, 3 deaths

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రంలో మరి 62 కరోనా పాజిటివ్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: