మార్కెట్లకు రుచించని ఆర్‌బిఐ విధానం

  260 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ముంబయి: ఆర్‌బిఐ నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బిఐ తగ్గించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి తోడుఈ ఆర్థిక సంవత్సరంలోను ఆర్థిక వృద్ధి రేటు నెగెటివ్‌గానే నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించడం కూడా మదుపరులను కలవరపెట్టింది. మరోవైపు టర్మ్ లోన్లపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించడంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు నష్టపోయాయి. ఉదయం స్వల్ప లాభాలతో కదలాడుతున్న […] The post మార్కెట్లకు రుచించని ఆర్‌బిఐ విధానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

260 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబయి: ఆర్‌బిఐ నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బిఐ తగ్గించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

దీనికి తోడుఈ ఆర్థిక సంవత్సరంలోను ఆర్థిక వృద్ధి రేటు నెగెటివ్‌గానే నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించడం కూడా మదుపరులను కలవరపెట్టింది. మరోవైపు టర్మ్ లోన్లపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించడంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు నష్టపోయాయి. ఉదయం స్వల్ప లాభాలతో కదలాడుతున్న సెన్సెక్స్ ఆ తర్వాత ఆర్‌బిఐ ప్రకటనతో నష్టాల్లోకి జారుకొంది. ఒక దశలో సుమారు 400 పాయింట్లు నష్టపోయింది. అయితే చివర్లో కొంత కోలుకొని 260.31 పాయింట్ల నష్టంతో 30,672.59 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ సైతం 67 పాయింట్లు నష్టపోయి 9039.25 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.95గా ఉంది. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 1.36 శాతం పడిపోగా, నిఫ్టీ 1శాతం నష్టపోయింది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి,బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, మహీంద్రా, మహీంద్రా, సిప్లీ, శ్రీసిమెంట్స్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. కాగా ఈదుల్‌ఫితర్ ( రంజాన్)ను పురస్కరించుకొని సోమవారం మార్కెట్లకు సెలవు.

Sensex closes 260 points lower at 30672

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మార్కెట్లకు రుచించని ఆర్‌బిఐ విధానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: