రెజ్లర్ దుర్మరణం

  కాలిఫోర్నియా: కుమారుడిని కాపాడే ప్రయత్నంలో అమెరికాకు చెందిన డబ్ల్యూడబ్ల్యూఇ మాజీ రెజ్లర్ షాద్ గాస్పర్డ్ దుర్మణం పాలయ్యాడు. కాలిఫోర్నియాలోని మెరీనా బీచ్‌లో షాద్ గాస్పర్డ్ తన పదేళ్ల కుమారుడితో కలిసి ఈతకు వెళ్లాడు. వాళ్లిద్దరూ ఈత కొడుతుండగా ఓ భారీ అల వచ్చింది. దీంతో తండ్రికొడుకులు దానిలో చిక్కుకున్నారు. మరోవైపు తన కుమారుడిని రక్షించే ప్రయత్నంలో షాద్ సముద్రంలోకి కొట్టుకు పోయాడు. అతన్ని రక్షించేందుకు లైవ్ గార్డ్‌లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అలల తీవ్రత […] The post రెజ్లర్ దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాలిఫోర్నియా: కుమారుడిని కాపాడే ప్రయత్నంలో అమెరికాకు చెందిన డబ్ల్యూడబ్ల్యూఇ మాజీ రెజ్లర్ షాద్ గాస్పర్డ్ దుర్మణం పాలయ్యాడు. కాలిఫోర్నియాలోని మెరీనా బీచ్‌లో షాద్ గాస్పర్డ్ తన పదేళ్ల కుమారుడితో కలిసి ఈతకు వెళ్లాడు. వాళ్లిద్దరూ ఈత కొడుతుండగా ఓ భారీ అల వచ్చింది. దీంతో తండ్రికొడుకులు దానిలో చిక్కుకున్నారు. మరోవైపు తన కుమారుడిని రక్షించే ప్రయత్నంలో షాద్ సముద్రంలోకి కొట్టుకు పోయాడు. అతన్ని రక్షించేందుకు లైవ్ గార్డ్‌లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అలల తీవ్రత అధికంగా ఉండడంతో లైవ్ గార్డ్‌లు ఎంత ప్రయత్నించినా షాద్‌ను రక్షించలేక పోయారు. షాద్ కోసం సముద్రంలో తీవ్రంగా గాలించినా ప్రయోజనం దక్కలేదు. రెండు రోజుల తర్వాత షాద్ మృతదేహం తీరంలో కొట్టుకు వచ్చింది. ఇక, రెజ్లర్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెజ్లర్ దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: